తెర వెనుక జరుగుతున్న ఈ వార్ లో ఎవరు గెలుస్తారో
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటు విశ్వంభర, రెండోది అనిల్ రావిపూడితో చేస్తున్న మెగా 157.
By: M Prashanth | 4 Aug 2025 11:16 AM ISTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకటు విశ్వంభర, రెండోది అనిల్ రావిపూడితో చేస్తున్న మెగా 157. అయితే విశ్వంభంర చెరు కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రంగా విశ్వంభర తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. కానీ విడుదల తేదీపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. మరోవైపు దర్శకుడు విశిష్ఠ మాత్రం వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై బజ్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు.
ఎందుకంటే చిరు 157 ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమా అప్డేట్లను సైతం ప్రమోషన్స్ లాగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే అనిల్ దూకుడును గమణించిన విశ్వంభర మేకర్స్ కూడా గేరు మార్చారు. తమ సినిమాకు కూడా హైప్ క్రియేట్ అవ్వాలని విశ్వంభర మేకర్స్, విశిష్ఠ వరుస ఇంటర్వ్యూలతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా చిరుకు తెలిసే జరుగుతుందని తెలుస్తోంది.
అలాగే విశ్వంభంర మేకర్స్ UV క్రియేషన్స్ ఇక రిలీజ్ డేట్ పై సన్నాహాలు చేస్తుందట. అక్టోబర్ మూడో వారంలో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందట. అంతా అనుకున్నట్లు జరిగితే చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ లు ఉన్నాయి. ఒకవేళ విశ్వంభం ఆక్టోబర్ కన్ఫార్మ్ అయితే, అనిల్ రావిపూడి 157 సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవచ్చు!
కానీ అనిల్ రావిపూడిని ఈ విషయంలో ఒప్పించడం అంత సులువు కాదు. అతడు ఒక స్టాండ్ పైనే గట్టిగా ఉండే డైరెక్టర్. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన స్టామినాను నిరూపించుకున్నాడు కూడా. ఇప్పుడు మళ్లీ అనిల్ సంక్రాంతి రిలీజ్ పైనే ఫోకస్ పెట్టాడు. ఇందులో అనిల్ కాంప్రమైస్ కాకపోతే.. చిరు ఫ్యాన్స్ కు బంపర్ ఆవకాశం వస్తుంది. కేవలం రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు చిరును బిగ్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు దక్కుతుంది.
ఇలా చివరిసారిగా 80లలో జరిగింది. 1991 నుండి, చిరంజీవికి సంవత్సరానికి రెండు లేదా మూడు కంటే ఎక్కువ సినిమాలు రాలేదు. కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇలాంటి ప్రయోగాలు ప్రమాదం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ వంటి పెద్ద పేర్లు కూడా హరి హర వీర మల్లు, ఓజీ సినిమాలతో ఇది ప్రయత్నిస్తున్నాయి. కానీ, వాళ్ల ప్లానింగ్ వేరే ఉంది!
అయితే చివరకు అనిల్ వెనక్కి తగ్గడానికి అంగీకరిస్తే, చిరు 157 సినిమా 2026 సమ్మర్ కు షిఫ్ట్ అవ్వొచ్చు. లేకపోతే, అతనే రివర్స్ లో చిరును కన్ విన్స్ చేస్తే.. అక్టోబర్‌లో విశ్వంభర, జనవరిలో చిరు 157 సినిమాలు రావడం లాంఛనమే అవుతుంది. మరి ఈ తెర వెనుక జరుగుతున్న ఈ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి!
