మెగా విశ్వంభర: 70లో నెవ్వర్ బిఫోర్ స్టైల్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. ఇకపోతే ఆయన కొత్త సినిమాలు ఒక్కోటి అప్‌డేట్ ఇస్తున్న కొద్దీ హైప్ రెట్టింపు అవుతుంది.
By: M Prashanth | 22 Aug 2025 10:23 AM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వయసు పెరుగుతున్నా క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. ఇకపోతే ఆయన కొత్త సినిమాలు ఒక్కోటి అప్‌డేట్ ఇస్తున్న కొద్దీ హైప్ రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ వరుస ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఎంటర్‌టైనర్, బాబీతో మరో మాస్ ప్రాజెక్ట్, అలాగే విశ్వంభర అనే సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి.
ఈ సినిమాలు అన్ని విభిన్న జానర్స్‌లో ఉండటంతో ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ దక్కనుంది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర, ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా స్థాయిలోనూ పెద్ద అంచనాలు క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఫ్యాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
కీరవాణి సంగీతం, భారీ తారాగణం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. చిరంజీవి 70వ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి తన స్టైల్‌కు సిగ్నేచర్ లాంటి డ్యాన్స్ పోజ్‌తో కనిపించడం ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఫుల్ ఎనర్జీతో, చార్మింగ్‌గా ఉన్న ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో పాటు ఈ పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఇక ఫ్యాన్స్ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్‌తో విశ్వంభర పోస్టర్‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇది మాత్రం మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి వయసుతో సంబంధం లేకుండా ఇంత స్టైల్‌గా, యంగ్ లుక్‌లో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
విశ్వంభర సినిమా రిలీజ్ కోసం మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్ 2026లో ఈ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా థియేటర్స్‌కి రానుంది. అప్పటివరకు గ్లింప్స్, పోస్టర్స్, టీజర్స్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, వరల్డ్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో వస్తోన్న ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మళ్లీ ప్రపంచానికి చాటనుంది.
