Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ముందున్న బిగ్ టార్గెట్ ఇదే!

మెగాస్టార్ ఇమేజ్ తో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఓటీటీ ప‌రంగా..థియేట‌ర్ బిజినెస్ ప‌రంగా తిరుగుండ‌దు.

By:  Srikanth Kontham   |   16 Sept 2025 7:00 PM IST
మెగాస్టార్ ముందున్న బిగ్ టార్గెట్ ఇదే!
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 156వ చిత్రం `విశ్వంభ‌ర` ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు. విజువ‌ల్ ఎఫెక్స్ట్ ప‌రంగా చెక్కుతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు వ‌శిష్ట ప్ర‌క‌టిం చ‌డంతో? రిలీజ్ కి ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ప్రొడ‌క్ట్ ప‌క్కాగా ఉంద‌ని క‌న్ప‌మ్ చేసు కునే వ‌ర‌కూ రిలీజ్ తేదీ ప్ర‌క‌టించే ప్ర‌శ‌క్తే లేద‌న్నాడు. కాబ‌ట్టి వ‌శిష్ట చెప్పే వ‌ర‌కూ రిలీజ్ తేదీ బ‌య‌ట‌కు రాదు. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే? ఈ సినిమా బాక్సాఫీస్ లెక్క‌? అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌.

ట్రేడ్ సైతం భారీగా:

మెగాస్టార్ ఇమేజ్ తో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఓటీటీ ప‌రంగా..థియేట‌ర్ బిజినెస్ ప‌రంగా తిరుగుండ‌దు. మెగా ఇమేజ్ తో మార్కెట్ అయిపోతుంది. కానీ బాక్సాఫీస్ టార్గెట్ ఎంత‌? అన్న‌ది ఇంట్రె స్టింగ్. ఈ సినిమాతో మెగాస్టార్ 500 కోట్ల క్ల‌బ్ లో చేరాల‌న్న‌ది అభిమానుల ఆశ‌. ట్రేడ్ కూడా అంచ‌నాలు భారీగానే పెట్టుకుంది. మెగా ఇమేజ్ స‌హా వ‌శిష్ట గ‌త చిత్రం 'బింబిసార' కూడా మంచి విజ‌యం సాధించ డంతో హిట్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా 500 కోట్లు రాబ‌డుతుంద‌ని అంచ‌నాలున్నాయి.

సైరా బాక్సాఫీస్ లెక్క ఎంత‌?

చిరంజీవి కెరీర్ లో రెండ‌వ పాన్ ఇండియా చిత్ర‌మిది. తొలిసారి `సైరా న‌ర‌సింహారెడ్డి`తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టారు. భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్ర‌మిది. 200-250 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. కానీ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. పెట్టుబ‌డి రిక‌వ‌రీ కూడా క‌ష్టంగానే రాబ‌ట్టింది. ట్రేడ్ లెక్క‌ల ప్ర‌కారం 200 కోట్లు అని అంటు న్నారు. కానీ అంత రాబ‌ట్టిందా? లేదా? అన్న‌ది స‌రైన స్ప‌ష్ట‌త లేదు.

చిరు కోసం బాలీవుడ్ త్ర‌యం:

అయినా మెగా ఇమేజ్ తో ఆ ఫిగ‌ర్ చాలా చిన్న‌దే. చిరంజీవితో పాన్ ఇండియా సినిమా అంటే 500 కోట్లు ప‌క్కా రాబ‌ట్టాలి. ఇప్పుడా ఛాన్స్ `విశ్వంభ‌ర‌`కు క‌నిపిస్తోంది. హిట్ టాక్ తెచ్చుకుంటే 'విశ్వంభ‌ర' న‌ల్లేరు మీద న‌డ‌క‌లా 500 కోట్లు రాబ‌డుతుంద‌ని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి ముగ్గురు బిగ్ స్టార్స్ సిద్దంగా ఉన్నారు. అమితాబ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, అమీర్ఖాన్ లు చిరంజీవి పిలిస్తే రాకుండా ఉండ‌రు. ఇంకా ఛాన్స్ తీసుకుంటే బాద్ షా షారుక్ ఖాన్ కూడా రంగంలోకి దిగుతారు. వీళ్లంతా బ‌రిలోకి వ‌స్తే ఓపెనింగ్స్ వ‌ర‌కూ తిరుగుండ‌దు. కానీ ఆ త‌ర్వాత కంటెంట్ తో మాత్ర‌మే కొట్టుకురావాలి.