Begin typing your search above and press return to search.

మెగాస్టార్ నో చెప్పలేని కథతో వచ్చాడా..?

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక ముదురు ప్రేమకథ రాసి ఆయన్ను కన్విన్స్ చేశాడట డైరెక్టర్ వెంకీ కుడుముల.

By:  Ramesh Boddu   |   20 Oct 2025 10:07 AM IST
మెగాస్టార్ నో చెప్పలేని కథతో వచ్చాడా..?
X

మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాల విషయంలో తన దూకుడు పెంచారనిపిస్తుంది. విశ్వంభర, మన శంకర వరప్రసాద్ సినిమాలు పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి నెక్స్ట్ బాబీతో ఒక సినిమా శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా లైన్ లో పెట్టారు. చిరు బాబీ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. నానితో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెల ఆ సినిమా రిలీజ్ తర్వాత మెగా మూవీని మొదలు పెడతారని తెలుస్తుంది. చిరంజీవిలోని ఊర మాస్ ని అందులో చూపించాలని ఫిక్స్ అయ్యాడట శ్రీకాంత్ ఓదెల.

చిరంజీవి కోసం ఒక ముదురు ప్రేమకథ..

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక ముదురు ప్రేమకథ రాసి ఆయన్ను కన్విన్స్ చేశాడట డైరెక్టర్ వెంకీ కుడుముల. ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ సినిమా మిస్ ఫైర్ అయ్యింది. ఐతే ఆ సినిమాకు ముందే చిరంజీవితో వెంకీ కుడుముల సినిమా కథా చర్చలు జరిగాయి. వెంకీ చెప్పిన స్టోరీ ఓకే కానీ స్క్రీన్ ప్లే విషయంలో చిరంజీవి డౌట్ ఎక్స్ ప్రెస్ చేశారట. అందుకే ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారు.

ఐతే కొంత టైం తీసుకున్న వెంకీ మరో కొత్త కథతో చిరంజీవి దగ్గరకు వెళ్లాడట. ఈసారి ఒక ముదురు ప్రేమకథతో వెంకీ కుడుముల వెళ్లారట. అందులో చిరంజీవి మిడిల్ ఏజ్ రోల్ లో కనిపిస్తారట. సినిమా కథ అంతా చాలా సరదాగా రాసుకున్నాడట వెంకీ కుడుముల. ఐతే డైరెక్టర్ చెప్పిన పాయింట్ ఇంకా సినిమాలో కొన్ని సీన్స్ చిరంజీవి నో చెప్పలేని విధంగా ఉన్నాయట. అందుకే వెంటనే వెంకీతో సినిమా చేసేద్దాం అన్నారట చిరంజీవి.

చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ని వెంకీ కుడుముల పట్టేస్తే..

వెంకీ కుడుముల ఒక ఫ్లాప్ తీసి ఉన్నాడు. ఛలో, భీష్మ తర్వాత రాబిన్ హుడ్ భారీ డిజాస్టర్ అయ్యింది. అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ని వెంకీ కుడుముల పర్ఫెక్ట్ గా పట్టేస్తే మాత్రం సినిమా మరో లెవెల్ లో ఉంటుంది.

చిరంజీవి కూడా యువ దర్శకులతో చేస్తే తనని కొత్తగా ప్రెజంట్ చేస్తారన్న హోప్ తో ఉన్నారు. మన శంకర వరప్రసాద్ తో కామెడీ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేస్తున్న చిరు విశ్వంభర తో మరోసారి జగదేకవీరుడు అతిలోక సుందరి రోజులు గుర్తు చేస్తారని అంటున్నారు. ఆ నెక్స్ట్ రాబోయే 3 సినిమాలు ముగ్గురు టాలెంటెడ్ డైరెక్టర్స్ తో లాక్ చేసుకున్నారు చిరంజీవి. మరి ఈ సినిమాలు ఫ్యాన్స్ కి ఏ రేంజ్ ట్రీట్ అందిస్తాయన్నది చూడాలి.