Begin typing your search above and press return to search.

చిరు, వెంకీ "నాటు నాటు" ట్రీట్..!

ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తుంటే ఆ హంగామా వేరే లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అంతా తెర మీద ఆ ఇద్దరు హీరోలు చేసే యాక్షన్ ని సూపర్ ఎంజాయ్ చేస్తారు.

By:  Ramesh Boddu   |   12 Dec 2025 3:06 PM IST
చిరు, వెంకీ నాటు నాటు ట్రీట్..!
X

ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తుంటే ఆ హంగామా వేరే లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అంతా తెర మీద ఆ ఇద్దరు హీరోలు చేసే యాక్షన్ ని సూపర్ ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ షేరింగ్ ఒక్కటే సూపర్ హై ఇస్తే ఇక ఇద్దరు హీరోలు అలా కలిపి స్టెప్పులు వేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ లో నాటు నాటు సాంగ్ తో అదరగొట్టారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా సెన్సేషన్ అయ్యింది. RRR లోని ఆ సాంగ్ కి ఆస్కార్ కూడా వచ్చింది.

మన శంకర వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్..

ఐతే నెక్స్ట్ వార్ 2 లో ఎన్ టీ ఆర్, హృతిక్ రోషన్ కూడా కలిసి కాలు కదిపారు. ఆ సాంగ్ కూడా ఫ్యాన్స్ ని అలరించింది. ఐతే నెక్స్ట్ ఇలాంటి ట్రీట్ మరోసారి ఫ్యాన్స్ కి ఉండబోతుందని తెలుస్తుంది. సీనియర్ స్టార్స్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు.

సినిమాలో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో చిరంజీవి, వెంకీ ఇద్దరు అదరగొట్టేస్తారని టాక్. అంతేకాదు ఇద్దరికి ఒక హుక్ స్టెప్ ఉంటుందని ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ అంతా ఆ హుక్ స్టెప్పుతో సోషల్ మీడియా సెన్సేషన్ గా చేస్తారని అంటున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు సీనియర్ స్టార్స్ చేసే ఈ హంగామా ఫ్యాన్స్ కే కాదు సినీ లవర్స్ కి కూడా సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు.

సంథింగ్ స్పెషల్ గా వెంకీ, చిరు సాంగ్..

ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి ఇప్పటికే సూపర్ క్రేజ్ ఉంది. సంక్రాంతికి అతని సినిమా వస్తే తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక మన శంకర వరప్రసాద్ లో మెగా బాస్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా సర్ ప్రైజ్ చేయబోతున్నారు. వెంకీ, చిరు కలిసి చేసే ఈ సాంగ్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సాంగ్ బీట్స్ కూడా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తాయని తెలుస్తుంది.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు వస్తుంది. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ ఆ హిట్ మేనియా కొనసాగించేలా చిరంజీవి సినిమాలో కూడా ఆయన స్పెషల్ రోల్ ప్లాన్ చేశారు. చిరు, వెంకీ సీన్స్ మాత్రమే కాదు సాంగ్ కూడా అదిరిపోతుందని టాక్. మరి అది ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.