వెంకీ క్యామియో విషయంలో ట్విస్ట్ ఇచ్చిన అనిల్.. ఏం ప్లాన్ చేశాడో?
టాలీవుడ్ లో అసలు నెగిటివ్ ఫ్యాన్సే లేని హీరో అంటే ఎవరైనా చెప్పే పేరు వెంకీ. టాలీవుడ్ లోని అందరూ ఆయన్ని ఎంతగానో అభిమానిస్తారు.
By: Sravani Lakshmi Srungarapu | 9 Jan 2026 1:04 AM ISTఈ మధ్య ఒక హీరో సినిమాలో మరొక హీరో క్యామియో చేయడం చాలా కామనైపోయింది. అలా చేయడం వల్ల సినిమాకు కూడా ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ తోడవుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడలాంటి ఓ సినిమా రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో ఓ సినిమా వస్తోంది. అదే మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్టర్.
చిరూ మూవీలో వెంకీ క్యామియో
ఈ మూవీలో వెంకీ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. చిరూ, వెంకీ కలిసి టాలీవుడ్ లో 40 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ వారిద్దరూ కలిసి ఇప్పటివరకు సినిమా చేసింది లేదు. కానీ అనిల్ రావిపూడి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాను చేశారు. ఈ సినిమాలో వెంకీ ఫుల్ లెంగ్త్ రోల్ చేయకపోయినా మెగాస్టార్ మూవీలో వెంకీ క్యామియో అనేసరికి అందరికీ ఎగ్జైట్‌మెంట్ పెరిగిపోయింది.
టాలీవుడ్ లో అసలు నెగిటివ్ ఫ్యాన్సే లేని హీరో అంటే ఎవరైనా చెప్పే పేరు వెంకీ. టాలీవుడ్ లోని అందరూ ఆయన్ని ఎంతగానో అభిమానిస్తారు. అలాంటి వెంకీ మన శంకరవరప్రసాద్ గారులో క్యామియో చేస్తున్నారంటే సినిమాకు అది స్పెషల్ ఎట్రాక్షన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తే మూవీలో వెంకీ క్యారెక్టర్ హైలైట్ అవనుందని, చిరూ- వెంకీ కాంబినేషన్ సీన్స్ బాగా పేలాయని అర్థమవుతుంది.
కన్నడిగుడిగా వెంకీ
అయితే ఈ సినిమాలో వెంకీ క్యారెక్టర్ గురించి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ మూవీలో వెంకీ ఓ కన్నడ వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారని, అతని క్యారెక్టర్ పేరు వెంకీ గౌడ అని చెప్పారు. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకీ కన్నడిగుడి క్యారెక్టర్ చేయడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తుంది. సినిమా సెకండాఫ్ లో వచ్చే వెంకీ క్యారెక్టర్ సుమారు అరగంట పాటూ ఉంటుందని, మూవీలో వెంకీ ఉన్నంతసేపు ఎంటర్టైన్మెంట్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. మరి చిరూ- వెంకీ ద్వయం ఆడియన్స్ ను ఏ మేర మెప్పిస్తారో చూడాలి.
