Begin typing your search above and press return to search.

MSG: మెగా విక్టరీ.. ఏం చెబుతారో..

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు చూడటానికి ఆడియన్స్ దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబో టాప్ లిస్ట్ లో ఉంటుంది.

By:  M Prashanth   |   5 Jan 2026 4:37 PM IST
MSG: మెగా విక్టరీ.. ఏం చెబుతారో..
X

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లు చూడటానికి ఆడియన్స్ దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబో టాప్ లిస్ట్ లో ఉంటుంది. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరే టైమ్ వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' (MSG) ఈ ఇద్దరు లెజెండ్స్ ని స్క్రీన్ మీద కలపడమే కాదు, ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఒకే స్టేజ్ మీదకు తీసుకువస్తున్నారు. ఇది బాక్సాఫీస్ హిస్టరీలో ఒక రేర్ మూమెంట్.

లేటెస్ట్ గా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ చూసి మెగా, దగ్గుబాటి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనవరి 7న హైదరాబాద్ లో జరగబోయే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ హాజరుకాబోతున్నారు. ఒకే వేదికపై ఈ ఇద్దరు బాక్సాఫీస్ బాద్షాలు సందడి చేయబోతుండటం బిగ్గెస్ట్ న్యూస్ అనే చెప్పాలి. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి మధ్య ఉండే స్నేహం, ఆ బాండింగ్ చూడటానికి కోట్లాది కళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ను జస్ట్ టీజర్ లా చూపించి హైప్ పీక్స్ కు తీసుకెళ్లారు. ఇక 'మెగా విక్టరీ' మాస్ సాంగ్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇన్నేళ్లుగా ఎంతోమంది డైరెక్టర్లు ట్రై చేసినా కుదరని ఈ క్రేజీ ఫీట్ ని అనిల్ రావిపూడి సాధ్యం చేసి చూపించారు. ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ దాచుకునే మెమొరబుల్ మూమెంట్స్ ను అనిల్ ఈ సినిమా ద్వారా అందిస్తున్నారనే నమ్మకం కలిగించారు.

సినిమా విషయానికి వస్తే.. చిరు ఇందులో ఏజెంట్ గా, ఎన్ఎస్ఏ ఆఫీసర్ గా కనిపిస్తూనే వింటేజ్ స్వాగ్ తో అదరగొడుతున్నారు. నయనతారతో కామెడీ ట్రాక్, చిరు మార్క్ టైమింగ్ హైలైట్ గా నిలవనున్నాయి. ట్రైలర్ లో చిరు ఎనర్జీ, స్టైల్ చూస్తుంటే 'శంకర వర ప్రసాద్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేయబోతున్నారో క్లియర్ గా అర్థమవుతోంది.

సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ హై రేంజ్ లో ఉన్నాయని విజువల్స్ చూస్తేనే తెలుస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకు మరో అసెట్ కానుంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫైనల్ గా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా సంక్రాంతిలో ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. అటు స్క్రీన్ మీద, ఇటు స్టేజ్ మీద చిరు వెంకీల 'మెగా విక్టరీ' సందడి చూడటానికి ఫ్యాన్స్ రెడీ అయ్యారు. ఇక ఒకరిపై మరొకరు ఈ హీరోలు ఎలాంటి పొగడ్తలతో వస్తారో చూడాలి.