Begin typing your search above and press return to search.

క్రిస్మస్ స్పెషల్.. చిరు, వెంకీ మాస్ సెలబ్రేషన్ అప్డేట్

నిజానికి చిరంజీవి, వెంకటేష్ ఒకే మూవీలో నటించడం ప్రత్యేకం. దానికి తోడు వారి కాంబినేషన్ లో సాంగ్ ఉండడంతో ఇటు సినీ ప్రియులు.. అటు ఇద్దరి హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు.

By:  M Prashanth   |   26 Dec 2025 12:20 AM IST
క్రిస్మస్ స్పెషల్.. చిరు, వెంకీ మాస్ సెలబ్రేషన్ అప్డేట్
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. తొలుత అతిథి పాత్రలో వెంకీ కనిపిస్తారని తెలిసినా.. ఆ తర్వాత ఆయన రోల్ రన్ టైమ్ ను పెంచారట. ఆ స్క్రీన్ టైమ్ లో ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో సాంగ్ కూడా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

నిజానికి చిరంజీవి, వెంకటేష్ ఒకే మూవీలో నటించడం ప్రత్యేకం. దానికి తోడు వారి కాంబినేషన్ లో సాంగ్ ఉండడంతో ఇటు సినీ ప్రియులు.. అటు ఇద్దరి హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మాస్ సాంగ్ ప్లాన్ చేశారని తెలియడంతో ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు.

అదే సమయంలో చిరు, వెంకీ సాంగ్ అప్డేట్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆది సాయి కుమార్ నటించిన శంభాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్వరలో సాంగ్ ను రిలీజ్ చేస్తామని అనిల్ రావిపూడి తెలిపారు. నేడు క్రిస్మస్ స్పెషల్ గా చిన్న అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి, వెంకటేష్ సాంగ్ అప్డేట్ ను శుక్రవారం ఇస్తామని వీడియోతో వెల్లడించారు.

ఆ వీడియోలో కారులో చిరంజీవి, వెంకటేష్ వెళ్తున్నట్లు చూపించారు. వారి ఫేసెస్ ను రివీల్ చేయకపోయినా.. గ్లాసెస్ ను చేతులతో పట్టుకున్నట్లు చూపించారు. ఇంతలో వారి కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు వెయిట్ చేస్తుంటారు. బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్, ఆంథమ్ ఆఫ్ ది సీజన్, మెగా విక్టరీ మాస్ సాంగ్ అంటూ క్యాప్షన్స్ ఇస్తూ అంచనాలు పెంచారు.

అయితే వీడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే ఉంది. ప్రస్తుతం ఆ గ్లింప్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. సాంగ్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్లింప్స్ ను చూస్తుంటే.. పాట ఓ రేంజ్ లో ఉండనుందని అర్థమవుతుందని కామెంట్లు పెడుతున్నారు.

ఇక మూవీ నుంచి ఇప్పటికీ రిలీజైన రెండు పాటలు కూడా అదిరిపోయే రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. యూట్యూబ్‌ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, లవ్ సాంగ్ శశిరేఖ కూడా దూసుకుపోతోంది. ఇప్పుడు చిరు, వెంకీ స్టెప్పులతో మూడో పాట మాస్ సాంగ్ రానుంది.

కాగా, సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌ గా నటిస్తున్నారు. వీటీవీ గణేష్, కేథరిన్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.-