చిరు-వెంకీ కడుపుబ్బా నవ్వించేలా!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకర వరప్రసాద్ గారు` తెరకెక్కుతోన్న్ సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 23 Oct 2025 10:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' తెరకెక్కుతోన్న్ సంగతి తెలిసిందే. ఇది పక్కా అనీల్ మార్క్ ఎంటర్ టైనర్. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమని చిరంజీవి ముందే చెప్పేసారు. కథ వినే సమయంలోనే తానెంతగా నవ్వుకున్నారో? చెప్పకనే చెప్పారు. `చంటబ్బాయ్` లాంటి సినిమా చేస్తున్న అనుభూతి కలుగుతుందని..ఆ మూవ్ మెంట్స్ ను మళ్లీ ఇంత కాలానికి ఆస్వాదించే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.
యాక్షన్ సీన్స్ ఎక్కడా తగ్గలేదా:
అలాగని పూర్తిగా కామెడీ చిత్రంగానే కాకుండా చిరంజీవి మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అవసరం మేర యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే సినిమాలో విక్టరీ వెంకేటేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ఆయన సెట్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో చిరు-వెంకీ మధ్య ఎలాంటి సన్నివేశాలుంటాయి? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. తాజాగా యూనిట్ వర్గాల నుంచి అందుతోన్న సమచారం ప్రకారం ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే సీన్స్ అని క్లారిటీ వస్తుంది.
పరిపూర్ణ కమెడియన్ గా చిరు:
ఇద్దరి కామెడీ టైమింగ్ ని బేస్ చేసుకుని అనీల్ మంచి కామెడీ ట్రాక్ రాసినట్లు చెబుతున్నారు. ఆ స న్నివేశాలు ప్రేక్షకుల్ని సీటు లో కూర్చోనివ్వకుండా నిరంతరం నవ్వుకు గురి చేస్తాయంటున్నారు. చిరంజీవిలో పరిపూర్ణ కమెడియన్ ని అనీల్ బయటకు తెస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవి కెరీర్ ఆరంభంలో కామెడీ పాత్రలు పోషించారు. కానీ కాలక్రమంలో ఆ పాత్రలకు దూరమయ్యారు. మధ్యలో కొన్ని చిత్రాల్లో ఆయనో కామెడీ టింజ్ ని టచ్ చేసారు. కానీ పూర్తి స్థాయి కమెడియన్ ని హైలైట్ చేయలేదు.
ఆ సినిమా తర్వాత వాటికి దూరంగా:
'శంకర్ దాదా ఎంబీబీఎస్' లాంటి సినిమా తర్వాత చిరు మళ్లీ ఆ తరహా సీరియస్ అటెంప్ట్ చేయలేదు. కానీ శంకవర వరప్రసాద్ లో మాత్రం చంటబ్బాయ్ రేంజ్ కామెడీ సీన్స్ ఉంటాయంటున్నారు. వాటిలో వెంకీ జోడీ అయ్యే సరికి ఆ సన్నివేశాలు పీక్స్ లో ఉంటాయని చిత్ర వర్గాల్లో డిస్కషన్స్ జరుగుతోంది. మరి చిరు-వెంకీ ఇమేజ్ ఆధారంగా అనీల్ ఎలాంటి సన్నివేశాలు రాసాడు? అన్నది ప్రచార చిత్రాలు రిలీజ్ అయితే గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. అన్ని పనులు పూర్తి చేసి జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
