మెగాస్టార్, వెంకీ.. ఈ సాంగ్ తో థియేటర్లలో పూనకాలే!
టాలీవుడ్ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు చూస్తుంటే కళ్లు చెదిరిపోతాయి. ఇన్నాళ్లు కేవలం ఊహల్లోనే ఉన్న ఒక క్రేజీ సీన్ ఇప్పుడు రియల్ గా జరగబోతోంది.
By: M Prashanth | 30 Nov 2025 10:00 PM ISTటాలీవుడ్ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు చూస్తుంటే కళ్లు చెదిరిపోతాయి. ఇన్నాళ్లు కేవలం ఊహల్లోనే ఉన్న ఒక క్రేజీ సీన్ ఇప్పుడు రియల్ గా జరగబోతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో రచ్చ చేయడానికి రెడీ అయ్యారు. ఆ ఇద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే వచ్చే కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఒకరు బాక్సాఫీస్ బాస్, మరొకరు విక్టరీ ఐకాన్. వీరిద్దరినీ కలిపే సాహసం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఏదో వచ్చి వెళ్ళే పాత్రలా కాకుండా, ఇద్దరూ కలిసి అదిరిపోయే డ్యాన్స్ వేస్తే ఫ్యాన్స్ కు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే జరగనుంది. అభిమానుల అరుపుల మధ్య ఒక భారీ సెట్ లో ఆ మ్యాజిక్ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఒక భారీ సెట్ వేశారు. అక్కడ ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య వచ్చే ఒక మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బీట్ కు ఇద్దరూ వారి స్టైల్ లో డ్యాన్స్ చేస్తున్నారు.
సెట్స్ లో వీరిద్దరి ఎనర్జీ చూసి యూనిట్ మెంబర్స్ షాక్ అవుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. అందుకే ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వెంకటేష్ ది ఇందులో గెస్ట్ రోల్ అయినా, ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుందట. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ కలయిక ఫుల్ మీల్స్ లాంటిది.
ఇప్పటికే రిలీజైన 'మీసాల పిల్ల' సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే నయనతార, చిరంజీవి కాంబోలో మరో రొమాంటిక్ మెలోడీ కూడా రాబోతోంది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో దిగబోతోంది.
అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కు, ఈ ఇద్దరు స్టార్ల జోష్ తోడైతే రికార్డులు బద్దలవ్వాల్సిందే. రెండు వర్గాల అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా ఉండబోతోంది. మెగా, విక్టరీ ఫ్యాన్స్ కు ఇక కాలర్ ఎగరేసుకునే టైమ్ వచ్చినట్లే. ఇక ఈ సినిమాకు ఇప్పటికే మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లకు పైగా బిజినేష్ చేసినట్లు టాక్. ఇక డిజిటల్ రైట్స్ ని జీ5 దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
