అనీల్ రావిపూడికి వెంటనే డబుల్ ధమాకా ఆఫర్
బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వెంకీతో కలిసి పూర్తి స్థాయి సినిమాలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బహిరంగ వేదికపై మెగా విక్టరీ అభిమానుల సమక్షంలో ప్రకటించారు.
By: Sivaji Kontham | 8 Jan 2026 12:45 PM ISTమెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి రూపొందించిన `మన శంకరవరప్రసాద్ గారు` సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సాహు గారపాటి - సుష్మిత కొణిదెల నిర్మించారు. నయనతార, కేథరిన్ కథానాయికలు. వెంకీ ఈ చిత్రంలో 45 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటించారు. ఇది అతిథి పాత్ర ఎంతమాత్రం కాదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వెంకీతో కలిసి పూర్తి స్థాయి సినిమాలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బహిరంగ వేదికపై మెగా విక్టరీ అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అంతేకాదు.. ఈ మల్టీస్టారర్ కోసం కథ రాయాలనుకుంటే, ఆ అవకాశం అనీల్ రావిపూడికే దక్కాలని కూడా చిరు బహిరంగ వేదికపై అన్నారు. మెగాబాస్ ఆఫర్ ఇవ్వగానే అనీల్ రావిపూడి హంబుల్ గా ఆయన వైపు తిరిగి చూస్తూ, `తప్పకుండా సర్` అనేసాడు.
టాలీవుడ్ మూల స్థంబాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేష్ లతో అనీల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ జాక్ పాట్ కొట్టేశాడు. మన శివశంకరవరప్రసాద్ గారు తర్వాత వెంటనే మరో భారీ మల్టీస్టారర్ తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. అయితే చిరుకి ఉన్న లైనప్ దృష్ట్యా ఈ సినిమా ప్రారంభమయ్యేందుకు కొంత సమయం పట్టొచ్చు. అయితే స్క్రిప్ట్ ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. `మన శివశంకరప్రసాద్ గారు` సక్సెస్ కూడా దీనిని నిర్ణయించగలదు. అనీల్ రావిపూడి & రచయితల బృందం స్క్రిప్టును ఎంత వేగంగా రూపొందిస్తే, అంత వేగంగా మెటీరియలైజ్ అయ్యేందుకు కూడా ఛాన్స్ లేకపోలేదు.
సంక్రాంతి బరిలో `మన శివశంకరవరప్రసాద్ గారు` గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని మెగాస్టార్ ఇప్పటికే కాన్ఫిడెంట్ గా ప్రకటించేసారు. ముఖ్యంగా అనీల్ రావిపూడి టేకింగ్ మేకింగ్ లో వేగంపైనా, పనిలో గ్రిప్ పైనా చిరు ప్రశంసలు కురిపించారు. పరిమిత బడ్జెట్ తో కేవలం 85 రోజులలోనే ఇద్దరు పెద్ద స్టార్లు నటించిన సినిమాని రూపొందించిన రావిపూడి మేకింగ్ స్టైల్ కి చిరు చాలా ఇంప్రెస్ అయిపోయానని తెలిపారు. అందుకే వేదికపై మెగా విక్టరీ అభిమానుల సమక్షంలో అనీల్ రావిపూడికి బంపరాఫర్ ని ప్రకటించారు. నిజానికి రావిపూడి బ్యాక్ టు బ్యాక్ జాక్ పాట్ కొట్టేసాడు. అతడు వేగంగా స్క్రిప్టును రూపొందించి ఆ ఇద్దరు స్టార్లను మెప్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా `ఎఫ్ 2` ఫ్రాంఛైజీని గ్రాండ్ సక్సెస్ చేయడమే గాక, వెంకీ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించాడు అనీల్ రావిపూడి. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి శంకరవప్రసాద్ గారు విషయంలోను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. థియేటర్లలో కామెడీ వినోదాన్ని మించి భావోద్వేగాలు రక్తి కట్టిస్తాయని అనీల్ రావిపూడి నమ్మకంగా చెబుతున్నాడు. అన్నిటికీ సమాధానం థియేటర్లలో దొరుకుతుంది.. మరో రెండు రోజుల్లోనే ప్రీమియర్లతో సందడి ప్రారంభమవుతోంది. ఈ సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు పోటీ బరిలో ఉన్నా కానీ, శంకర వర ప్రసాద్ హవా సాగుతుందనే అంతా అంచనా వేస్తున్నారు.
