Begin typing your search above and press return to search.

మెగాస్టార్ లైనప్ కాక‌పుట్టించేలా!

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులకు ఎంత‌టి ప్రాధాన్య‌త‌నిస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తిభావంతుడైతే అనుభవంతో ప‌నిలేకుండా అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   12 May 2026 6:00 PM IST
మెగాస్టార్ లైనప్ కాక‌పుట్టించేలా!
X

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులకు ఎంత‌టి ప్రాధాన్య‌త‌నిస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తిభావంతుడైతే అనుభవంతో ప‌నిలేకుండా అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా ఓ పది సినిమాలు చేసిన అనుభ‌వం అస‌రం లేదు. స‌రైన హిట్ ఒక్క‌టిస్తే చాలు. అత‌డిపై అన్న‌య్య‌కు న‌మ్మ‌కం క‌లిగిందంటే? నో చెప్ప‌కుండా ఛాన్స్ ఇస్తున్నా రు. `విశ్వంభ‌ర` ప్రాజెక్ట్ అలా ప‌ట్టాలెక్కిందే. చిరంజీవి-వ‌శిష్ట కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అనివార్య కార‌ణాల‌తో రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతున్నా? బ‌జ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి సినిమా లైన‌ప్ కూడా అంతే స్ట్రాంగ్ గా క‌నిపిస్తుంది. వ‌డ‌పోసి మ‌రీ తెలివైన డైరెక్ట‌ర్ల‌ను వెతికి ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `వాల్తేరు వీర‌య్య` త‌ర్వాత చిరు-బాబి కాంబినేష‌న్ లో రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఇదీ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ తోనే వ‌స్తున్నారు. మెగాస్టార్‌ను మళ్ళీ వింటేజ్ లుక్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి ప‌ని చేస్తారు. ఈసినిమాలో శ్రీకాంత్ పాత చిరంజీవిని చూపిస్తాడ‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే ఠారెత్తిపోతుంది. 30 ఏ ళ్ల క్రితం నాటి చిరంజీవిని చూపించ‌బో తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి ఓల్డ్ క‌ల్ట్ చిత్రం `రాక్ష‌సుడు` త‌ర‌హాలో ఉంటుంద‌ని వినిపిస్తోంది.

మెగాస్టార్ ఇమేజ్‌కు శ్రీకాంత్ ఓదెల రా స్టైల్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ తోనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ మూర్తి చిరంజీవిని కలవడం సరికొత్త చర్చకు దారితీసింది. `ఆపరేషన్ జావా`, `సౌదీ వెళ్ళక్క` వంటి విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన తరుణ్ మూర్తి చిరంజీవి కోసం ఏదైనా వైవిధ్యమైన కథను సిద్ధం చేశారా? లేక ఏదైనా మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిరంజీవి గతంలో కొన్ని రీమేక్ చిత్రాలతో విజయాలను అందుకున్నా? ఈసారి తరుణ్ మూర్తితో ఓ స్ట్రెయిట్ సినిమానే చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

చిరంజీవిలో ఈ వైవిధ్యం ఆయన మార్కెట్ రేంజ్‌ను మరింత విస్తరించడమే కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి దోహదపడుతుంది. సీనియర్ హీరో అయినా? నేటి తరం దర్శకుల ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కళ. ఇవ‌న్నీ కార్య‌రూపం దాల్చితే మెగాస్టార్ మూడేళ్ల పాటు ఖాళీ ఉండ‌రు. కొత్త సినిమాలు ఏవైనా? మూడేళ్ల త‌ర్వాతే చేయాల్సి ఉంటుంది.