మెగాస్టార్ తో ఒకే ఏడాది ఇద్దరు సీనియర్లు!
ఈ రెండు చిత్రాల్లో నటిస్తోంది సీనియర్ బ్యూటీలు త్రిష..నయనతారలు. ఇద్దర్నీ చిరంజీవి రెండవ సారి రిపీట్ చేయడం విశేషం.
By: Srikanth Kontham | 2 Oct 2025 8:30 AM ISTమెగాస్టార్ చిరంజీవి 2026 లో రెండు సినిమాలతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `విశ్వంభర` షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విజువల్ ఎఫెక్స్ట్ సహా ప్రతీది పక్కాగా ఉన్న తర్వాత రిలీజ్ చేయాలని దర్శకుడు వశిష్ట ప్లాన్ లో ఉన్నాడు. దీనిలో భాగంగా డిలే అవుతుంది. ఏడాది ముగింపు లేదా? వచ్చే ఏడాది ఆరంభంలో ఆ చిత్రం రిలీజ్ కానుంది. మరో చిత్రం 157 అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం రిలీజ్ ని అనీల్ ముందే ఫిక్స్ చేసాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసారు.
ఈ రెండు చిత్రాల్లో నటిస్తోంది సీనియర్ బ్యూటీలు త్రిష..నయనతారలు. ఇద్దర్నీ చిరంజీవి రెండవ సారి రిపీట్ చేయడం విశేషం. `స్టాలిన్` అనంతరం మళ్లీ `విశ్వంభర`లో త్రిష భాగమైంది. `గాడ్ ఫాదర్`, `సైరా నరసింహారెడ్డి` తర్వాత 158 లో నయనతారను రిపీట్ చేస్తున్నారు. ఇలా సీనియర్ బ్యూటీలిద్దరు సూపర్ సీనియర్ తో నటిచడం..ఆ రెండు సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ కు రావడం ఇంట్రెస్టింగ్. దాదాపు పదేళ్ల తర్వాత త్రిష నటిస్తోన్న తెలుగు చిత్రం ఇదే. `నాయకీ` తర్వాత అమ్మడు తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైంది. అనువాద చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది.
ఈ నేపథ్యంలో త్రిష అభిమానులకు 156 సంథింగ్ స్పెషల్ మూవీగా చెప్పొచ్చు. త్రిష చేతిలో ఉన్నది కూడా ఈ క్క చిత్రమే. ఇదే ఏడాది రిలీజ్ అయిన `ఐడెంటిటీ`, `విదాముయార్చీ`, `గుడ్ బ్యాడ్ అగ్లీ`, `థగ్ లైఫ్` లాంటి చిత్రాల్లో నటించినా అవేవి అమ్మడికి ఆశించిన ఫలితాలు అందించలేదు. దీంతో మెగా 156 సక్సెస్ కీలకంగా మారింది. ఈ సినిమా విజయంతో తెలుగులో కొత్త అవకాశాలు అందుకోవాలన్న ఆశతో ఉంది. ఇక నయన్ `గాడ్ ఫాదర్` తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమా చేయలేదు.
`గాడ్ ఫాదర్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి తమిళ సినిమాలకే పరిమితమైంది. మధ్యలో తెలుగు అవకాశాలు వచ్చినా? నయన్ సెలక్టివ్ గా ఉండటంతో వాటిని తిరస్కరించింది. `మన శంకరవర ప్రసాద్` తోనే మళ్లీ రీలాంచ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఇతర భాషల చిత్రాలతోనూ వచ్చే ఏడాది సందడి చేయడం ఖాయం. ప్రస్తుతం నయన్ నటిస్తోన్న ఆరేడు చిత్రాలు ఆన్ సెట్స్ ల ఉన్నాయి.
