Begin typing your search above and press return to search.

చిరు బాక్సాఫీస్ డామినేషన్.. టాప్ లెక్క ఇదే..

ఐదో స్థానంలో ఖైదీ నెం.150 ఉండగా.. రూ.165 కోట్ల వసూళ్లతో ఆ చిత్రం చిరంజీవి రీఎంట్రీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అయితే పై విషయాలను మరోసారి లిస్ట్ రూపంలో తెలుసుకుందాం.

By:  M Prashanth   |   5 March 2026 8:00 AM IST
చిరు బాక్సాఫీస్ డామినేషన్.. టాప్ లెక్క ఇదే..
X

టాలీవుడ్ సీనియర్ హీరోల బాక్సాఫీస్ ఫైట్ లో మరోసారి మెగాస్టార్ హవా కనిపిస్తోంది. జనరేషన్ మారినా.. ట్రెండ్ మారినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని వసూళ్ల లెక్కలు క్లియర్ గా చెబుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంతో.. టాప్-5 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఆయనదే డామినేషన్ గా తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రూ.303 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. కంటెంట్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఆ చిత్రం మెగా ఫ్యాన్స్‌ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పించింది. దీంతో ఆ చిత్రం టాలీవుడ్ సీనియర్ హీరోల కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

రెండో స్థానంలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఉంది. రూ.277 కోట్ల గ్రాస్ వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఆ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. వెంకటేష్‌ కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు మెయిన్ అసెట్స్ గా నిలిచాయి.

మూడో స్థానంలో మెగాస్టార్ పీరియాడిక్ మూవీ సైరా నరసింహారెడ్డి నిలిచింది. రూ.240 కోట్ల వసూళ్లతో ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రం విజువల్ గ్రాండియర్‌ గా ఆకట్టుకుంది. నాలుగో స్థానంలో వాల్తేరు వీరయ్య ఉండగా.. రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఆ మాస్ ఎంటర్టైనర్‌ లో చిరంజీవి మాస్ లుక్, డ్యాన్స్లు, యాక్షన్ సీన్స్ అభిమానులను థియేటర్లకు ఫుల్ గా రప్పించాయి. వింటేజ్ మెగా స్టైల్‌ ను గుర్తు చేసిన ఆ సినిమా మంచి కమర్షియల్ హిట్‌ గా నిలిచింది. ఐదో స్థానంలో ఖైదీ నెం.150 ఉండగా.. రూ.165 కోట్ల వసూళ్లతో ఆ చిత్రం చిరంజీవి రీఎంట్రీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అయితే పై విషయాలను

మరోసారి లిస్ట్ రూపంలో తెలుసుకుందాం.

మన శంకర వరప్రసాద్ గారు- రూ.303 కోట్లు

సంక్రాంతికి వస్తున్నాం- రూ.277 కోట్లు

సైరా నరసింహారెడ్డి- రూ.240 కోట్లు

వాల్తేరు వీరయ్య - రూ.230 కోట్లు

ఖైదీ 150- రూ.165 కోట్లు

ఏదేమైనా టాప్-5లో నాలుగు సినిమాలు చిరంజీవివే కావడం గమనార్హం. ఆయన స్టార్‌ డమ్ ఏ రేంజ్ లో ఉందో క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇక ముందు పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం విశ్వంభర త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ యాక్ట్ చేస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం (AK 47) విడుదలకు సిద్ధమవుతోంది. ఆ రెండు సినిమాల రిజల్ట్స్ తో టాప్-5 లెక్కలు మారే అవకాశం ఉంది.