యువత DPRతో సిద్ధంగా ఉండాలి.. టాప్-10 మెగా టిప్స్!
మెగాస్టార్ చిరంజీవి లెజెండరీ నటుడిగా శిఖరాన్ని అధిరోహించారు. ఆయన పలు సందర్భాలలో యువతను ఉద్దేశించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చెప్పిన `టాప్-10 విలువైన సూత్రాలు- టిప్స్ ఆసక్తికరం.
By: Sivaji Kontham | 23 Sept 2026 7:58 PM ISTమెగాస్టార్ చిరంజీవి లెజెండరీ నటుడిగా శిఖరాన్ని అధిరోహించారు. ఆయన పలు సందర్భాలలో యువతను ఉద్దేశించి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చెప్పిన `టాప్-10 విలువైన సూత్రాలు- టిప్స్ ఆసక్తికరం.
సమయపాలన :
అమెరికా అధ్యక్షుడైనా, సాధారణ రైతుకైనా రోజుకు 24 గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామన్నదే మనల్ని విజేతగా నిలబెడుతుంది. `టైమ్ ఈజ్ మనీ`.. ఒక్కసారి గడిచిపోతే ఆ నిమిషాలు తిరిగి రావు.
కఠినమైన క్రమశిక్షణ :
జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా క్రమశిక్షణను ఎప్పుడూ కోల్పోకూడదు. షూటింగ్‌కు సమయానికి వెళ్లడం, ప్రతి చిన్న విషయాన్ని బాధ్యతగా భావించడం లీడ్ యాక్టర్ లేదా ఒక లీడర్‌గా ఉన్నవారికి చాలా ముఖ్యం. మనమే కనుక కచ్చితంగా ఉంటే హోల్ యూనిట్-టీమ్ అంతా అలర్ట్‌గా ఉంటుంది.
రోడ్‌మ్యాప్ - ప్రణాళిక :
యువత సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకూడదు. భవిష్యత్తు కోసం ఒక చక్కటి రోడ్‌మ్యాప్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) లాంటి ప్రణాళిక వేసుకుని మునుముందుకు సాగాలి.
లక్ష్యాలకే తొలి ప్రాధాన్యం:
మనసు అనే ఖాళీ జార్‌ను ముందుగా మన ముఖ్యమైన లక్ష్యాలు (రాళ్లు) తో నింపాలి. ఆ తర్వాతే విమర్శలు, అవమానాలు (ఇసుక) అందులో సర్దుకుంటాయి. ముందుగా నిరాశ నిస్పృహలకు చోటిస్తే మన అసలైన గోల్స్ డైల్యూట్ అయిపోతాయి.
నెగెటివిటీని అధిగమించడం:
జీవితం ఎవరికీ కేక్ వాక్ లా ఉండదు. ఎన్నో అవమానాలు, నిరాశలు ఎదురవుతుంటాయి. మన మైండ్‌సెట్ మార్చుకుంటే చిన్న చిన్న నెగెటివిటీలను, విమర్శలను చాలా సులభంగా పక్కనపెట్టి ముందుకు వెళ్ళవచ్చు.
తల్లిదండ్రుల కలలను నెరవేర్చడం:
మన తల్లిదండ్రుల కోరికలు తీర్చడం, సమాజం మనల్ని చూసి గర్వపడేలా ఉన్నత స్థాయికి ఎదగడమే యువత జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలుగా ఉండాలని ఆయన తరచూ చెబుతుంటారు.
కష్టపడే తత్వమే శ్రీరామరక్ష :
ఎలాంటి షార్ట్‌కట్లు లేకుండా నిజాయితీగా కష్టపడే తత్వమే శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది. శ్రమను నమ్ముకున్న ఏ వ్యక్తినీ విజయం ఎప్పటికీ వదిలిపెట్టదు.
ఆత్మవిశ్వాసమే బలం:
పరిస్థితులు ఎలా ఉన్నా మన మీద మనకు ఉండే నమ్మకం (ఆత్మవిశ్వాసం) ఎప్పుడూ సడలకూడదు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ధైర్యమే యువతకు అసలైన ఆయుధం.
సామాజిక బాధ్యత :
వ్యక్తిగత కెరీర్‌తో పాటు తోటి మనుషుల పైనా, సమాజం విషయంలోను బాధ్యత కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్నవారికి వీలైనంత సహాయం చేయడం ద్వారా నిజమైన సంతృప్తి లభిస్తుంది.
నిరంతరం నేర్చుకునే తత్వం:
ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలని, జీవితంలో ఏ క్షణంలోనైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మెగాస్టార్ యువతకు పిలుపునిస్తుంటారు.
