Begin typing your search above and press return to search.

మెగాస్టార్ నే మార్చేసిన పుస్త‌క‌మది!

మెగాస్టార్ చిరంజీవి నటనతోనే కాదు. త‌న హుందాతనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

By:  Srikanth Kontham   |   19 April 2026 12:38 PM IST
మెగాస్టార్ నే మార్చేసిన పుస్త‌క‌మది!
X

మెగాస్టార్ చిరంజీవి నటనతోనే కాదు. త‌న హుందాతనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే అన్న‌య్య‌ వ్యక్తిత్వ వికాసంలో- ఆలోచనా దృక్పథంలో `ది సీక్రెట్` అనే పుస్తకం కీలక పాత్ర పోషించిందని ఆయన మాట‌ల్ని బ‌ట్టి అర్ద‌మ‌వుతోంది. రోండా బైర్న్ రచించిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం చిరంజీవి జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా చేసిందని పేర్కొనడం విశేషం. ముఖ్యంగా సామాజిక హోదాలో ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉండే వ్యక్తులతో , సామాన్యులతో ఎలా మెలగాలో ఈ పుస్తకం నేర్పిందని అభిప్రాయ‌ప‌డ్డారు.

విజయం తలకెక్కినప్పుడు మనుషుల్లో తెలియకుండానే అహంకారం వస్తుంటుంది. కానీ `ది సీక్రెట్` చదివిన తర్వాత ఎదుటి వ్యక్తి స్థాయి ఏదైనప్పటికీ వారితో మర్యాదగా, ప్రేమాభిమానాలతో మాట్లాడటం వల్ల కలిగే మానసిక ప్రశాంతతను చిరంజీవి అర్థం చేసుకున్నారు. రోజువారీ జీవితంలో అనుసరించే చిన్న చిన్న అలవాట్లు, మాట తీరు మన వ్యక్తిత్వాన్ని ఎలా మలుస్తాయో ఈ పుస్తకం ద్వారా మెగాస్టార్ గ్రహించారు. ఒకరితో మాట్లాడేట‌ప్పుడు వారి పట్ల సానుకూలతను ప్రదర్శించడం వల్ల, తిరిగి మనకు కూడా అదే సానుకూలత లభిస్తుందని చిరంజీవి నమ్ముతారు.

సినిమా సెట్స్‌లో లైట్ మ్యాన్ నుండి ప్రొడక్షన్ బాయ్ వరకు అందరినీ పేరు పెట్టి పిలవడం, వారి క్షేమ సమాచారాలను అడగడం వెనుక ఈ పుస్తక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి దృష్టిలో `ది సీక్రెట్` కేవలం ఒక పుస్తకమే కాదు. ఒక జీవన సూత్రం. `లా ఆఫ్ అట్రాక్షన్` ద్వారా మనం దేని గురించి అయితే బలంగా ఆలోచి స్తామో? అది మన జీవితంలోకి వస్తుందని చిరంజీవి కూడా ఎంతో విశ్వసిస్తారు. అందుకే మెగాస్టార్ ఎప్పుడూ తన మాటల్లో కానీ, చేతల్లో కానీ ప్రతికూలతకు చోటు ఇవ్వరు. తోటి నటుల విజయాలను మనస్ఫూర్తిగా అభినం దించడం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడటం వంటివన్నీ ఆ పుస్తకం నేర్పిన పాఠాల ప్రతిరూపాలే.

ఈ పుస్తకాన్ని చిరంజీవి తన తోటి వారికి , అభిమానులకు కూడా తరచుగా సిఫార్సు చేస్తుంటారని తెలుస్తోంది. ఒక స్టార్‌గా ఎంత ఎదిగినా? ఒదిగి ఉండటం వల్ల వచ్చే గౌరవం వెలకట్టలేనిదని ఆయన ఈ పుస్తకం ద్వారా ఆచరణలోకి తెచ్చారు. సంక్షోభ సమయాల్లో కూడా నిబ్బరంగా ఉండటం, ఎదుటి వారిని చిన్నచూపు చూడకుండా గౌరవించడం వంటి గొప్ప లక్షణాలు ఆయన మాటల్లో క‌నిపిస్తున్నాయి. అంత గొప్ప మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌క్తి కాబ‌ట్టే మెగాస్టార్ గా నీరాజ‌నాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఆయ‌న న‌టించిన `విశ్వంభ‌ర` చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతోంది.