సురేఖను చూసి తడబడ్డ మెగాస్టార్
ఎంతటి పెద్ద సెలబ్రిటీ అయినా భార్య వద్దకు వచ్చేసరికి ఆమె మాట వినాల్సిందే. ఆమె ముందు వినయంగా ఉన్నట్టు ప్రవర్తించాల్సిందే.
By: Sravani Lakshmi Srungarapu | 11 Sept 2025 10:57 AM ISTఎంతటి పెద్ద సెలబ్రిటీ అయినా భార్య వద్దకు వచ్చేసరికి ఆమె మాట వినాల్సిందే. ఆమె ముందు వినయంగా ఉన్నట్టు ప్రవర్తించాల్సిందే. భార్య పక్కన ఉంటే భర్త ప్రవర్తించే తీరుకి, భార్య పక్కన లేనప్పుడు భర్త ప్రవర్తించే తీరుకి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఉదాహరణతో సహా వివరించారు.
హార్రర్ జానర్ అంటే ఇష్టం
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కిష్కింధపురి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుస్మిత ఓ గెస్టుగా హాజరయ్యారు. తనకు హార్రర్ జానర్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సుస్మిత, కిష్కింధపురి ట్రైలర్ చాలా బావుందని, సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు. అయితే ఈవెంట్ కు వచ్చిన సుస్మిత నుంచి మరింత ఇన్ఫర్మేషన్ లాగాలని ప్రయత్నించారు యాంకర్ సుమ.
భయపెట్టే రకాన్ని నేను
మిమ్మల్ని ఏ విషయాలు భయపెడతాయని అడగ్గా, మనం ఆడవాళ్లం భయపెట్టే రకాలమే కాదు, భయపడే రకాలు కాదని చెప్పారు. మరి చిరంజీవి గారికి మీ అమ్మ గారంటే ఏమైనా భయముందా అని అడగ్గా, ఈ రోజే ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. మన శంకరవరప్రసాద్ గారు కోసం ప్రెజెంట్ సాంగ్ ను షూట్ చేస్తున్నామని సుస్మిత చెప్పారు.
సురేఖ రాగానే స్టెప్స్ మర్చిపోయిన నాన్న
సినిమా సెట్స్ కు అమ్మ వచ్చిందని, అప్పటివరకు బాగానే డ్యాన్సులు చేస్తున్న నాన్న, అమ్మ వచ్చి కూర్చునేసరికి స్టెప్స్ మర్చిపోవడం, డ్యాన్సుల్లో తడబడటం లాంటివి జరిగాయని, ఇవన్నీ అమ్మ ముందు ఉండటం వల్లే జరిగాయని అసలు విషయాన్ని బయటపెట్టారు. సుస్మిత ఈ విషయాన్ని వెల్లడించాక ఎంతటి మెగాస్టార్ అయినా భార్య ముందు తడబడాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమా విషయానికొస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు.
