రీ రిలీజ్ లో బిగ్ డిజాస్టర్
చిన్న సినిమాలు కానీ, పెద్ద సినిమాలు కానీ స్టార్ హీరోల పాత హిట్స్‌ని మళ్లీ థియేటర్లలో చూపించి ఫ్యాన్స్‌కి ఫెస్ట్ ఇవ్వడం ఆచారంగా మారిపోయింది
By: M Prashanth | 23 Aug 2025 9:31 AM ISTటాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు కామన్ అయింది. చిన్న సినిమాలు కానీ, పెద్ద సినిమాలు కానీ స్టార్ హీరోల పాత హిట్స్‌ని మళ్లీ థియేటర్లలో చూపించి ఫ్యాన్స్‌కి ఫెస్ట్ ఇవ్వడం ఆచారంగా మారిపోయింది. చాలా సందర్భాల్లో ఈ రీ రిలీజ్‌లు మంచి రికార్డులు కూడా సాధించాయి. కానీ అన్ని సినిమాలు అదే రేంజ్ రిస్పాన్స్‌ను అందుకోవడం లేదు. ఈ సారి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ ఫలితం మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.
మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్‌డే సందర్భంగా పాత సినిమా స్టాలిన్‌ని 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్‌కి ఇది ఓ గిఫ్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ అంచనాలకు విరుద్ధంగా ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అంతగా లేకపోవడం షాకింగ్‌గా మారింది. స్టాలిన్ రీ రిలీజ్‌కు మొదటి రోజే ఫ్యాన్స్ నుండి పెద్ద రెస్పాన్స్ రాలేదు.
కొన్ని షోలకు మాత్రమే డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. అదికాక అనేక చోట్ల షోలు మొదలవ్వకముందే క్యాన్సిల్ అయ్యాయి. ఆడియన్స్‌లో ఎలాంటి ఆసక్తి కనిపించకపోవడంతో బుకింగ్స్ లేకపోవడం ప్రధాన కారణం. ఈ పరిస్థితి ఫ్యాన్స్‌కే షాక్ ఇచ్చింది. ఇకపోతే ఈ ఫలితాన్ని కొంతమంది ముందే ఊహించారు. ఎందుకంటే స్టాలిన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో హైప్ కనిపించలేదు.
పోస్టర్లు, అప్‌డేట్స్‌తోనూ పెద్ద ఎక్సైట్మెంట్ రాలేదు. దాంతోనే రీ రిలీజ్ ఫలితం సాధారణంగా ఉంటుందని అప్పటికే చెప్పుకున్నారు కొందరు. ఇప్పుడు అదే నిజమైంది. స్టాలిన్ సినిమాను ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 2006లో విడుదల చేశారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. ఇక రీ రిలీజ్‌లో పెద్దగా మ్యాజిక్ ఏమి జరగలేదు.
మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన స్టాలిన్ 4K రీ రిలీజ్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. రీ రిలీజ్ కలెక్షన్స్ లలో కనీసం టాప్ 20లో కూడా లేదని టాక్. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి సినిమాల తర్వాత మెగాస్టార్ నుంచి కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ రీ రిలీజ్ అసలు హంగామా చేయలేకపోయింది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమా రానుంది.
