ఓదెలతో చిరు.. అంతా ఓకే కానీ..
మెగాస్టార్ చిరంజీవి.. శ్రీకాంత్ ఓదెల.. ఆ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
By: M Prashanth | 7 Oct 2026 11:47 AM ISTమెగాస్టార్ చిరంజీవి.. శ్రీకాంత్ ఓదెల.. ఆ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా, ప్యారడైజ్ తో ఓదెల చూపించిన రా అండ్ రస్టిక్ మేకింగ్ కు చిరంజీవి మాస్ ఇమేజ్ తోడైతే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో చిరు చేతులకు రక్తం.. పక్కనే ఓదెల.. దీంతో ఇది మామూలు సినిమా కాదని ఫీలింగ్ అప్పుడే వచ్చేసింది.
కానీ ఇప్పుడు ఆ కాంబినేషన్ విషయంలో అసలు డిస్కషన్ సినిమా ఎలా ఉంటుందనే దానికంటే.. ఎప్పుడు మొదలవుతుందనే దానిపైనే. 2024 డిసెంబర్ లో ఆ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నాని నిర్మాతగా తెరకెక్కించనున్న ఆ మూవీని భారీ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నట్లు చెప్పారు. అప్పట్లో వచ్చిన హైప్ కు తగ్గట్టే త్వరగానే షూటింగ్ మొదలవుతుందని అంతా అనుకున్నారు.
కానీ ప్యారడైజ్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ సినిమా ఆలస్యం కావడంతో చిరంజీవితో చేయాల్సిన సినిమా వెనక్కి వెళ్లింది. ఆ విషయంపై నిర్మాత నాని కూడా రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ప్యారడైజ్ ఆలస్యం కాకపోయి ఉంటే.. చిరంజీవితో ఓదెల సినిమా ఈ ఏడాది మొదలయ్యేదని చెప్పారు. కానీ తమ సినిమా ఆలస్యం కావడంతో చిరంజీవి తన ఇతర కమిట్మెంట్స్ కు డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
అంటే ఆ కాంబో విషయంలో సమస్య కంటే టైమింగ్ దే అసలు సమస్య అన్నమాట. అయితే ఇప్పుడు సినిమా విషయంలో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న కాకా పూర్తయ్యేలోపు శ్రీకాంత్ ఓదెల తన వైపు ఉన్న పనులను పూర్తి చేసుకుని సిద్ధమవుతారని, కాకా తర్వాత నేరుగా చిరు- ఓదెల సినిమా మొదలయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అదే జరిగితే ఫ్యాన్స్ కు పెద్దగా వెయిటింగ్ ఉండకపోవచ్చు.
కానీ మరికొందరు మాత్రం వేరేలా చెబుతున్నారు. కాకా పూర్తయ్యాక చిరంజీవి మరో సినిమా చేయబోతున్నారని.. ఆ ప్రాజెక్ట్ తర్వాత ఓదెల సినిమాకు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే నిజమైతే ఆ కాంబినేషన్ మరింత లేట్ కావచ్చు. అందుకే ఏది ఫైనల్ అనేది చెప్పలేని పరిస్థితి. ఇక ప్యారడైజ్ రిజల్ట్ కూడా ఆ డిబేట్ కు మరో కారణంగా మారింది. సినిమా బడ్జెట్, రిజల్ట్, ఓదెల నెక్స్ట్ ప్లానింగ్.. ఇవన్నీ కలిసి ఆ ప్రాజెక్టుపై ఎఫెక్ట్ చూపుతున్నాయనే టాక్ ఉంది.
అయితే సినిమా క్యాన్సిల్ అయిందని మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం లేదు. ఇక చిరంజీవి లాంటి స్టార్ తో ఓదెల లాంటి డైరెక్టర్ ఎలాంటి స్టోరీతో వస్తాడోనన్న హైప్ ఇప్పటికీ అలాగే ఉంది. ఓదెల తన అభిమాన హీరోతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అందుకే అంచనాలు తగ్గే పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. చివరిగా.. చిరు- ఓదెల సినిమా హోల్డ్ లో ఏం లేదని, కాస్త వెనక్కి వెళ్లిందని చెప్పాలి. అయితే ఎప్పుడు మొదలవుతుందనేదే ఇప్పుడు అసలు మ్యాటర్.
