Begin typing your search above and press return to search.

చిరు ఫ్యాన్స్ కోరిక శ్రీ‌కాంత్ ఓదెల తీరుస్తాడా?

చిరు నుంచి ర‌జ‌నీ స్థాయి మాస్ మ‌సాలా సినిమాని చాలా కాలంగా అభిమానులు ఆశిస్తున్నారు. ర‌జ‌నీ సినిమా అంటే క‌నిపించే వైబ్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ .. ఆ హ‌డావిడీ వేరుగా ఉంటుంది.

By:  Ravindar Gorantla   |   23 Feb 2026 12:17 PM IST
చిరు ఫ్యాన్స్ కోరిక శ్రీ‌కాంత్ ఓదెల తీరుస్తాడా?
X

చిరు నుంచి ర‌జ‌నీ స్థాయి మాస్ మ‌సాలా సినిమాని చాలా కాలంగా అభిమానులు ఆశిస్తున్నారు. ర‌జ‌నీ సినిమా అంటే క‌నిపించే వైబ్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ .. ఆ హ‌డావిడీ వేరుగా ఉంటుంది. మ‌రి మ‌న మెగాస్టార్ నుంచి అలాంటి సినిమా ఇంత వ‌ర‌కు ఎందుకు రావ‌డం లేదు?. డైరెక్ట‌ర్లు పూనుకోవ‌డం లేదా? లేక అలాంటి సినిమా చేయాల‌నే ఆలోచ‌న మ‌న వాళ్ల‌లో ఎవ‌రికీ రావ‌డం లేదా? అనే చ‌ర్చ గ‌త కొంత కాలంగా జ‌రుగుతోంది. దీనికి యువ ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల తెర‌దించి స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్నాడా? అంటే ఆవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

వ‌రుస ఫ్లాపుల త‌రువాత మెగాస్టార్ చిరంజీవి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ యాక్ష‌న్ కామెడీ డ్రామా `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు`. ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుని మోగాస్టార్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. చిరు సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా నిలిచి వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న చిరుకు కొత్త జోష్‌ని అందించింది. ఈ సినిమా అందించిన స‌క్సెస్ ఉత్సాహంతో ఉన్న మెగాస్టార్ త్వ‌ర‌లో `విశ్వంభ‌ర‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.

మ‌ల్లిడి వ‌శిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా సాగే ఫాంట‌సీ యాక్ష‌న్ డ్రామా. యువీ క్రియేష‌న్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ కార‌ణంగా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన రిలీజ్ డేట్‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ త‌రువాత చిరు క్రేజీ ప్రాజెక్ట్‌ని చేయ‌నున్న విష‌యం తెలిసిందే. నేచుర‌ల్ స్టార్ నానితో `ది ప్యార‌డైజ్‌`ని తెర‌కెక్కిస్తున్న యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల ఈ మూవీని రూపొందించ‌నున్నాడు.

నేచుర‌ల్ స్టార్ నాని, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా ఈ భారీ మూవీని నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. శ్రీ‌కాంత్ ఓదెల మార్కు బ్ల‌డ్ షేడ్‌తో సాగే ఈ సినిమాలో చిరు క్యారెక్ట‌ర్ నెవ‌ర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటుంద‌ని, ర‌స్టిక్ అండ్ ఇంటెన్స్‌, వ‌యోలెంట్ గా ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. అంతే కాకుండా 1970 నేప‌థ్యంలో సాగే క‌థ‌గా దీన్ని శ్రీ‌కాంత్ ఓదెల తెర‌పైకి తీసుకురానున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. చిరు నుంచి ఓ ప‌వ‌ర్ ఫుల్ మాస్ యాక్ష‌న్ డ్రామాని ప్రేక్ష‌కులు, అభిమానులు చాలా కాలంగా ఆశిస్తున్నారు.

ర‌జ‌నీ సినిమాల్లో ఉండే బ్యాగ్రౌండ్ స్కోర్, క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్స్, చిరు సినిమాలోనూ ఉండాల‌ని, ఆస్థాయి సినిమా కావాల‌ని ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక‌ని యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల ఈ మూవీతో తీర్చ‌నున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా నానిని ద‌స‌రా, ది ప్యార‌డైజ్ సినిమాల్లో ప్ర‌జెంట్ చేస్తున్న శ్రీ‌కాంత్ ఓదెల ..చిరుతో చేయ‌బోయే మూవీలోనూ ఆయ‌న‌ని అంతే కొత్త‌గా, మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించి ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేయనున్నాడ‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న చిరు అభిమానుల కోరిక నెర‌వేర‌డం ఖాయం అని ఇన్ సైడ్ టాక్‌.