Begin typing your search above and press return to search.

2026 మిడ్ లో మెగాస్టార్ బ‌రిలోకి!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `విశ్వంభ‌ర‌`, `మ‌న‌ శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే వాటి చిత్రీక‌ర‌ణ ముగించి చిరంజీవి ప్రీ అయిపోయారు.

By:  Srikanth Kontham   |   22 Dec 2025 2:00 PM IST
2026 మిడ్ లో మెగాస్టార్ బ‌రిలోకి!
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `విశ్వంభ‌ర‌`, `మ‌న‌ శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే వాటి చిత్రీక‌ర‌ణ ముగించి చిరంజీవి ప్రీ అయిపోయారు. వాటికి సంబంధించి చిరు కేవ‌లం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే హాజ‌ర‌వ్వాల్సి ఉంటుంది. ద‌ర్శ‌కులు ఇచ్చిన షెడ్యూల్స్ ప్ర‌కారం అందుకు అటెండ్ అవుతారు. అలాగే బాబితో కూడా మ‌రో సినిమాకు క‌మిట్ అయ్యారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. మ‌రి శ్రీకాంత్ ఓదెల‌తో చిరు ప్రాజెక్ట్ సంగ‌తేంటి? అన్న సందేహాం రాక మాన‌దు.

ఆ సినిమాకు కూడా మెగాస్టార్ ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తాజాగా అందుతోన్న స‌మాచారం. 2026 ద్వితియార్ధంలో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అందుకు త‌గ్గ‌ట్టు చిరంజీవి క్లియ‌ర్ గా డేట్లు కూడా ఇచ్చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే చిరంజీవి స్లిమ్ లుక్ లోకి మారింది శ్రీకాంత్ ప్రాజెక్ట్ కోస‌మ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఇది భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో? వింటేజ్ లుక్ లోకి మారారు. అందుకోసం కొన్ని నెల‌ల పాటు నిర్విరామంగా ప‌ని చేసారు. శ్రీకాంత్ స్క్రిప్ట్ త‌గ్గ‌ట్టు మౌల్డ్ అయ్యారు.

ప్ర‌స్తుతం శ్రీకాంత్ ఓదెల నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా `ది ప్యార‌డైజ్ `చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన చిత్రం. కానీ `పెద్ది` రిలీజ్ ఉండ‌టంతో వాయిదా ప‌డుతోంది. దీంతో ఏప్రిల్ లోనే ప్యార‌డైజ్ రిలీజ్ అవుతుంది. అనంత‌రం శ్రీకాంత్ ఆ మూవీ నుంచి ప్రీ అయిపోతాడు. నాటి నుంచి చిరు ప్రాజెక్ట్ లో బిజీ అవుతాడు. చిరంజీవీ సినిమాకు సంబంధించి శ్రీకాంత్ పూర్తి చేయాల్సిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కొంత ఉంది. న‌టీన‌టులు, హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి చేయాలేదు.

బాలీవుడ్ న‌టి రాణీ ముఖ‌ర్జీని తీసుకుంటున్నారు? అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి వ‌య‌సుకు..శ్రీకాంత్ రాసిన పాత్ర‌కు ప‌ర్పెక్ట్ గా ఆమె సూటువుతంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. కానీ ఇంకా ఫైన‌ల్ అవ్వ‌లేదు. సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల ఎంపిక అన్న‌ది ద‌ర్శ‌కుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారిన సంగ‌తి తెలిసిందే. న‌టీన‌టు లంతా సెట్ అయినా? హీరోయిన్ కుద‌ర‌క‌పోడం అతి పెద్ద స‌మస్య‌గా మారింది. దీంతో శ్రీకాంత్ ప్యార‌డైజ్ నుంచి రిలీవ్ అవ్వ‌గానే? ఆ పాత్ర‌పైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.