చిరంజీవిపై కోపంతో రవితేజ ఫ్యాన్స్? ఏం జరిగింది?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ హెల్దీ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు.
By: M Prashanth | 27 Jan 2026 1:00 AM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ హెల్దీ రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు. చిరంజీవికి పెద్ద అభిమాని అయిన రవితేజ.. కెరీర్ స్టార్టింగ్ లో ఆయన సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత ఆయనతో కలిసి పూర్తిస్థాయి పాత్రలు చేసే స్థాయికి ఎదిగారు. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు.
అయితే వారిద్దరూ.. రీసెంట్ గా సంక్రాంతి పండుగ కానుకగా వేర్వేరుగా తమ సినిమాలతో సందడి చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో థియేటర్స్ లోకి రాగా.. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా విడుదలైంది. రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా.. రిజల్ట్స్ మాత్రం వేర్వేరుగా వచ్చాయని చెప్పాలి.
పాజిటివ్ టాక్ అందుకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను పెద్ద ఎత్తున రప్పించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టగా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం యావరేజ్ రెస్పాన్స్ కే పరిమితమైంది. అయితే ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్.. చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా తమ హీరో సినిమా కోసం మాట్లాడారని అంటున్నారు.
నిజానికి నిన్న మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ జరగ్గా.. చిరు సంక్రాంతి చిత్రాల విషయాన్ని ప్రస్తావించారు. "నేను నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకటే కోరుకున్నా.. సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు బాగా ఆడాలి.. మంచి వసూళ్లు సాధించాలి.. థియేటర్స్ కిటకిటలాడాలి.. జనాలు రావాలని అనుకున్నా.. అదే చెప్పా.. నా మాటను మన్నించి ప్రజలు ఆదరించారు" అని చెప్పారు.
"ఒకటి అరా అటు ఇటుగా ఉన్నా సరే.. దాదాపు అన్ని సినిమాలు ప్రజలు ఆదరించారు.. సక్సెస్ అందించారు.. ఆ రేంజ్ లో ఆయా మూవీ టీమ్ కు హిట్స్ దక్కాయి.. ఇదే మంచి సంక్రాంతి" అని చెప్పారు. అయితే ఒకటి అరా సినిమా అనేది.. భర్త మహాశయులకు విజ్ఞప్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా రవితేజ అభిమానులు భావిస్తున్నారు. అందుకే కోప్పడుతూ పోస్టులు పెడుతున్నారు.
కానీ అక్కడ చిరంజీవి ఏ సినిమా పేరు కూడా ప్రస్తావించలేదు. అది కూడా తప్పుగా కాకుండా.. దాదాపు అన్ని సినిమాలు అని చెప్పారు. కాబట్టి రవితేజ ఫ్యాన్స్.. చిరంజీవి వ్యాఖ్యలపై అంతలా ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మెగాస్టార్ ఎవరినీ తప్పుగా అనలేదని, రిజల్ట్ కోసం చెప్పారని చెబుతున్నారు. చిరు, రవితేజ బాండింగ్ ను కూడా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఆ విషయంపై ఇప్పుడు చిరంజీవి లేదా రవితేజ రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.
