చిరంజీవికి సర్జరీ.. డోంట్ వర్రీ మెగా ఫ్యాన్స్
అల్లు శిరీష్ తన పెళ్లికి ఆహ్వానించేందుకు మావయ్య మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంటి వద్ద కలిసిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 17 Feb 2026 12:16 AM ISTఅల్లు శిరీష్ తన పెళ్లికి ఆహ్వానించేందుకు మావయ్య మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంటి వద్ద కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే చిరంజీవి చేతికి కట్టు కట్టి ఉండటం చూసి అభిమానులు కంగారు పడ్డారు. చిరు భుజానికి చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిందని కూడా కథనాలొచ్చాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం గురించి వస్తున్న రకరకాల పుకార్లపై ఇప్పుడు ఆయనే స్వయంగా స్పందించి అభిమానులకు క్లారిటీ ఇవ్వడం గొప్ప విషయం. తాజా అప్‌డేట్స్ ప్రకారం మెగాస్టార్ ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదు. అభిమానులు కంగారు పడాల్సినంత అసలే లేదు.
చిరంజీవి గారి భుజానికి ఒక చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది. అల్లు శిరీష్ పెళ్లి శుభలేఖను అందించడానికి వెళ్లిన ఫోటోల్లో చిరు భుజానికి ఆర్మ్ స్లింగ్ కనిపించింది. సర్జరీ తర్వాత దృశ్యమిది. అంటే.. చిరుకు శస్త్ర చికిత్స కారణంగా సమస్య ఏమీలేదు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు. ఇది కేవలం ముందు జాగ్రత్తగా చేయించుకున్న సాధారణ సర్జరీయేనని, ఇప్పటికే తన రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యానని చిరు స్వయంగా X (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ఈ సర్జరీని ప్రముఖ ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ విజయవంతంగా పూర్తి చేశారు.
సంక్రాంతికి విడుదలైన `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో చిరు మార్క్ యాక్షన్, కామెడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కూడా ట్రెండింగ్‌లో ఉంది.
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ (వీఎఫ్ఎక్స్) దశలో ఉంది. ఈ చిత్రం 10 జూలై 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తోంది.
డైరెక్టర్ బాబీతో మరో సినిమా పట్టాలెక్కనుంది. `వాల్తేరు వీరయ్య` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీతో చిరంజీవి మరో మాస్ యాక్షన్ చిత్రంలో నటించనున్నాడు. ఇది ఒక గ్యాంగ్ స్టర్ డ్రామా అని.. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మార్చి 2026 నుండి ప్రారంభం కానుంది.
మెగాస్టార్ చిరంజీవి త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.
