Begin typing your search above and press return to search.

అప్పుడు బాబీ 'ముఠా మేస్త్రి'.. ఇప్పుడు రావిపూడి 'గ్యాంగ్ లీడర్'!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో మైల్ స్టోన్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   22 Aug 2025 10:35 PM IST
అప్పుడు బాబీ ముఠా మేస్త్రి.. ఇప్పుడు రావిపూడి గ్యాంగ్ లీడర్!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో మైల్ స్టోన్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. తనదైన యాక్షన్, గ్రేస్, డ్యాన్స్, టాలెంట్ తో ఇప్పటికే అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడర్, కొండవీటి సింహం.. అలా ఒకటేమిటి.. చెప్పాలంటే బోలెడు మాస్టర్ పీస్ లు ఉన్నాయి.

అయితే ఇప్పుడు తెలుగు సినీ యువ దర్శకులంతా చదువుకుంటున్న రోజుల్లో మెగాస్టార్ సందడి మామూలుగా ఉండేది కాదు. చాలా మందికి సినిమా అంటే చిరంజీవిదే అన్నట్లు ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే ప్రస్తుత డైరెక్టర్స్ లో అనేక మంది చిరు ఫ్యాన్సే.

అందుకే చిరంజీవిని.. కెరీర్ లో ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో మెగాస్టార్ కొంత కాలంగా యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. యువ దర్శకుల చెప్పిన కథలు వింటున్నారు. వాళ్లు కూడా తాము ఇప్పటికే ఫిక్స్ అయిన విధంగా చిరును చూపించాలని ఫిక్స్ అయిపోయారు.

వాల్తేరు వీరయ్య మూవీకి గాను డైరెక్టర్ బాబీకి చిరు ఛాన్స్ ఇవ్వగా.. ఆయన ఫ్యాన్ బాయ్ గా మూవీ తీసి మంచి హిట్ అందుకున్నారు. మెగాస్టార్ క్యారెక్టర్ ను తాను కోరుకున్న విధంగా డిజైన్ చేశారు. ముఠా మేస్త్రీ వంటి చిత్రాల్లోని మాస్ ఫన్ అందరికీ గుర్తొచ్చేలా వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవిని చూపించారు. ఇప్పుడు మరోసారి తన ఫేవరెట్ హీరోతో వర్క్ చేయనున్నారు.

ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా రూపొందుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా టైటిల్ రివీల్ చేసిన రావిపూడి.. గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గ్లింప్స్ లో చిరు సూట్ లో కనిపించి మెప్పించారు. అయితే మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ ఫ్లేవర్ గ్లింప్స్ లో కనిపించింది. చిరు ఎంట్రీ చూస్తే.. చాలా మందికి గ్యాంగ్ లీడర్ మూవీలోని ఆయన లుక్ గుర్తొచ్చింది. బంగారు కోడి పెట్ట సాంగ్ బిట్ ఆకట్టుకుంది.

గ్లింప్స్ చివర్లోని గుర్రం కళ్లెం పట్టుకుని నడిపించే సీన్ చూస్తుంటే.. కొండవీటి సింహం సినిమా గుర్తుకొస్తుంది. మొత్తానికి అప్పుడు బాబీ ముఠా మేస్త్రి వంటి సినిమాల మాస్ ఫన్ ను బాబీ అందించగా.. ఇప్పుడు రావిపూడి గ్యాంగ్ లీడర్, కొండవీటి సింహం వంటి వివిధ చిత్రాల వైబ్స్ ను యాడ్ చేశారు. మరి ఓవరాల్ గా సినిమా ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.