Begin typing your search above and press return to search.

విశ్వంభర.. ఇది చిరుకు మామూలు టాస్క్ కాదు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   19 Jan 2026 8:45 AM IST
విశ్వంభర.. ఇది చిరుకు మామూలు టాస్క్ కాదు!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి కానుకగా థియేటర్స్ లో రిలీజైంది. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ సినిమా.. వాటిని అందుకుని దూసుకుపోతోంది. ప్రీమియర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ అందుకుని సందడి చేస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ.250 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ.. రూ.300 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు మూవీ సక్సెస్ అవ్వడంతో చిరంజీవితోపాటు మూవీ టీమ్ హ్యాపీ మోడ్ లో ఉంది. ముఖ్యంగా భోళాశంకర్ తర్వాత ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు మూవీతో చిరు కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పాలి.

అదే సమయంలో ప్రస్తుతం ఆయన.. యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో మూవీ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫుల్ మాస్ రోల్ లో చిరును బాబీ.. సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగాస్టార్‌ కు వాల్తేరు వీరయ్య మూవీతో మంచి హిట్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు అంతకుమించి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే అటు బాబీ కొల్లి మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే.. ఇటు విశ్వంభర మూవీ పనులను చిరంజీవి పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న విశ్వంభర.. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పటికి పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

రీసెంట్ గా సినిమా నుంచి వచ్చిన రెండో గ్లింప్స్.. పర్లేదనిపించుకుంది. కానీ ఫస్ట్ టీజర్ మాత్రం దారుణంగా విమర్శలు ఎదుర్కొంది. సాంగ్ కూడా అనుకున్నట్లు మెప్పించలేకపోయింది. ఏదేమైనా సినిమా మాత్రం అలరించాలని మూవీ టీమ్ చాలా కష్టపడుతుంది. కొన్ని నెలలుగా వర్క్ చేస్తుంది. వేసవిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు చిరంజీవికి పెద్ద టాస్కే వచ్చి పడిందని చెప్పాలి.

అదేంటంటే.. ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు అందరినీ ఆకట్టుకుని చిరులో ఫుల్ జోష్ నింపింది. ఇప్పుడు దాన్ని విశ్వంభర కంటిన్యూ చేయాల్సి ఉంది. అలా జరగాలంటే సినిమా హిట్ అవ్వాలి. అందుకు గాను చిరంజీవి ఫోకస్ పెట్టి దగ్గరుండి అన్ని పనులు చేయించుకోవాలి. సినిమా ఆడియన్స్ ను మెప్పించేలా ప్లాన్ చేసుకోవాలి. మరేం జరుగుతుందో.. మెగాస్టార్ ఏం చేస్తారో.. సినిమా ఎలా ఉంటుందో.. ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.