Begin typing your search above and press return to search.

స్టైల్.. స్టైల్ రా.. ఇది మెగాస్టార్ సూపర్ స్టైల్ రా..!

ఇక ఈ సినిమా నుంచి..ఇటీవల విడుదలైన చిరంజీవి స్టిల్స్ ఈ మాటలను నిజం చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో చిరంజీవి చాలా యంగ్‌గా కనిపించడమే కాకుండా..ఆయనలో వింటేజ్ టచ్ కూడా కనిపిస్తోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   19 Dec 2025 12:59 PM IST
స్టైల్.. స్టైల్ రా.. ఇది మెగాస్టార్ సూపర్ స్టైల్ రా..!
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర్ వరప్రసాద్ గారు.. చిత్రం 2026 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే సినిమాలు తీయడంలో అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో.. భారీ ఆసక్తి ఏర్పడింది.





ఇంతకుముందు అనిల్ రావిపూడి, వెంకటేష్‌తో ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి.. సూపర్ హిట్ సినిమాలు అందించారు. అలాగే బాలకృష్ణతో తీసిన ‘భగవంత్ కేసరి’ సినిమా సంక్రాంతికి మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే సంక్రాంతి సీజన్‌లో.. చిరంజీవితో సినిమా తీస్తుండటంతో అంచనాలు.. మరింత పెరిగాయి. ఈ సినిమాలో చిరంజీవిని చాలా స్టైలిష్‌గా..కొత్తగా చూపించబోతున్నానని అనిల్ రావిపూడి ఇప్పటికే పలుమార్లు..చెప్పిన విషయం తెలిసిందే.





ఇక ఈ సినిమా నుంచి..ఇటీవల విడుదలైన చిరంజీవి స్టిల్స్ ఈ మాటలను నిజం చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో చిరంజీవి చాలా యంగ్‌గా కనిపించడమే కాకుండా..ఆయనలో వింటేజ్ టచ్ కూడా కనిపిస్తోంది. ఆయన అభిమానులు సైతం..ఇటీవలి కాలంలో చిరంజీవిని ఇంత అందంగా.. ఆకర్షణీయంగా చూపించిన సినిమా లేదు.. అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ స్టిల్స్ వైరల్ అవుతూ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.





ఈ సినిమాకు మరో పెద్ద హైలైట్ వెంకటేష్ స్పెషల్ క్యామియో. ఇది కేవలం చిన్న అతిథి పాత్ర కాదని సమాచారం. దాదాపు 20 నిమిషాల పాటు వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆయనతో.. ఒక పూర్తి పాట, పవర్‌ఫుల్ ఫైట్ సీన్, అలాగే చిరంజీవితో కలిసి ఎన్నో కామెడీ సన్నివేశాలు ఉంటాయని టాక్. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరికీ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉండటంతో, వీరిద్దరి కాంబినేషన్ సీన్లు సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలవనున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేష్ కలిసి కనిపించే సాంగ్ హైలైట్‌గా నిలవనుంది.. ఇటీవల ఆ పాటకు సంబంధించిన షాడో గ్లింప్స్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ పాటను న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే అభిమానులకు ముందే పండుగ వాతావరణం వచ్చేస్తుంది.