Begin typing your search above and press return to search.

పవన్ కోసం సుజిత్.. చిరు కోసం సందీప్ వంగ..?

పవర్ స్టార్ ఫ్యాన్ గా సుజిత్ ఎలా ఫ్యాన్స్ కి ఓజీతో ఫీస్ట్ ఇచ్చాడో అలా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఫ్యాన్ ఫీస్ట్ సినిమా ఇవ్వాలని మెగాస్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

By:  Ramesh Boddu   |   29 Sept 2025 10:24 AM IST
పవన్ కోసం సుజిత్.. చిరు కోసం సందీప్ వంగ..?
X

పవర్ స్టార్ ఫ్యాన్ గా సుజిత్ ఎలా ఫ్యాన్స్ కి ఓజీతో ఫీస్ట్ ఇచ్చాడో అలా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ఫ్యాన్ ఫీస్ట్ సినిమా ఇవ్వాలని మెగాస్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మెగా అభిమానులు చాలా మంది స్టార్ డైరెక్టర్స్ రేంజ్ లో ఉన్నారు. వాళ్లలో పాన్ ఇండియా సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఆయన చిరంజీవికి ఎంత పెద్ద అభిమాని అన్నది చెప్పడం చాలా కష్టం.

సందీప్ వంగ చిరుని డైరెక్ట్ చేస్తే..

చిరంజీవి అంటే ఎంతో ఇష్టం ఉంది కాబట్టే ఆయన ఆరాధన ఫోటోని తన ఆఫీస్ లో పెట్టుకున్నాడు సందీప్ వంగ. అంతేకాదు చిరు ప్రతి సినిమా సీన్ ని ఎక్స్ ప్లైన్ చేస్తూ సందీప్ ఆయన అభిమానాన్ని చాటుతాడు. అలాంటి సందీప్ వంగ చిరుని డైరెక్ట్ చేస్తే ఇక ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. పవన్ కళ్యాణ్ కోసం సుజిత్ ఎలా ఐతే ఓజీ చేశాడో సందీప్ వంగ కూడా చిరంజీవి రాంపేజ్ కోసం ఒక సినిమా చేయాలని కోరుతున్నారు.

ఐతే దానికి కాస్త టైం ఉండేలా ఉంది కానీ ఈలోగా ఒక శాంపిల్ చూపించాలని చూస్తున్నాడు సందీప్ వంగ. యానిమల్ తర్వాత సందీప్ వంగ నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉంటారన్న టాక్ నడుస్తుంది.

స్పిరిట్ కోసం ప్రభాస్, చిరంజీవి..

ప్రభాస్ సినిమాలో చిరంజీవి అన్నది ఎంత పెద్ద సెన్సేషనో అనుకుంటే మెగా కల్ట్ ఫ్యాన్ అయిన సందీప్ వంగ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడా అన్నది మరో క్రేజీ థింగ్ అవుతుంది. ఈ క్రమంలో సందీప్ వంగ అసలు ప్రభాస్, చిరంజీవిని ఎలా కలుపుతున్నాడు స్పిరిట్ లో చిరంజీవి పోర్షన్ ఏంటన్న డిస్కషన్ నడుస్తుంది. స్పిరిట్ కోసం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఐతే ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి రోల్ చేస్తున్నారు. అది క్యామియోనా లేదా ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

చిరంజీవి మీద ఉన్న అభిమానం ఏంటో సందీప్ వంగ ఈ సినిమాలో శాంపిల్ చూపించి సినిమా క్లిక్ అయితే నెక్స్ట్ సందీప్ వంగ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కి సుజిత్ ఎలా అయితే ఓజీ ఇచ్చాడో సందీప్ కూడా చిరంజీవికి ఒక మెగా ఫీస్ట్ మూవీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సందీప్, చిరంజీవి ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం రికార్డులన్నీ సైడ్ అవ్వాల్సిందే అని మెగా ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు.