Begin typing your search above and press return to search.

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

మణిరత్నం దర్శకత్వంలో 1991లో వచ్చిన క్లాసిక్ మూవీ దళపతిలో నటించే అవకాశాన్ని చిరంజీవి రెండుసార్లు తిరస్కరించారట. మొదట మమ్ముట్టి పోషించిన పాత్రను, ఆ తర్వాత అరవింద్ స్వామి చేసిన అర్జున్ పాత్రను ఆఫర్ చేయగా ఆయన అంగీకరించలేదు. ఇదే పాత్ర కోసం మణిరత్నం నాగార్జునను సంప్రదించినా ఆయన కూడా నో చెప్పారట. చివరకు ఆ పాత్రలో అరవింద్ స్వామి నటించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   8 Nov 2026 10:24 AM IST
మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!
X

మనం తినే అన్నం మెతుకుపైన మన పేరు రాసిండాలి అంటారు. అలానే హీరోలు చేసే సినిమా పైన తప్పకుండా వాళ్ల పేరు రాసి ఉండాలి. కొన్నిసార్లు కథ విన్నప్పుడు ఇది తప్పకుండా హిట్ అవుతుంది అని ఒప్పుకొని..ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయ్యే సందర్భాలు ఎన్ని ఉంటాయో..ఒక సినిమా పెద్ద వర్క్ అవుట్ అవ్వదు అని రిజెక్ట్ చేసి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయ్యే సందర్భాలు కూడా అన్ని ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన విషయం మెగాస్టార్ చిరంజీవికి, ప్రముఖ దర్శకుడు మణిరత్నం మధ్య జరగడం విశేషం.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రంలో రజనీకాంత్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఇప్పటికీ ఒక క్లాసిక్ మూవీగా గుర్తింపు పొందింది.

అయితే ఈ సినిమాలో నటించే అవకాశం మొదట చిరంజీవికి వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు. మణిరత్నం ముందుగా మమ్ముట్టి పోషించిన పాత్ర కోసం చిరంజీవిని సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ మణిరత్నం చిరంజీవితో పనిచేయాలనే ఆలోచనను వదులుకోలేదు. మరోసారి ఆయనను సంప్రదించి సినిమాలోని ఇంకో ముఖ్యమైన పాత్రను ఆఫర్ చేశారు. ఈసారి అరవింద్ స్వామి పోషించిన అర్జున్ పాత్రను చిరంజీవికి చేయాలని కోరగా..ఈ పాత్రకు కూడా చిరంజీవి అంగీకరించలేదు.

ఆ తర్వాత ఇదే పాత్ర కోసం మణిరత్నం నాగార్జునను కూడా సంప్రదించారట. కానీ నాగార్జున కూడా ఆ అవకాశాన్ని వదులుకున్నారు. చివరికి అరవింద్ స్వామి ఆ పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మన తెలుగు హీరోలు ఇద్దరూ ఎందుకు అలాంటి పాత్రలు వదులుకున్నారు అని బాధపడుతున్నారు.