ఎంత టైమ్ వేస్ట్ చేసుకున్నా.. మెగా ఫ్యామిలీలో 'రజినీ' ప్లేస్ అదే..
సినిమాల విషయంలో ఎవరికి వారు పోటీ పడినా.. పర్సనల్ రిలేషన్స్ దగ్గరకు వచ్చేసరికి స్టార్ హీరోల మధ్య మంచి రిలేషనే ఉంటుంది.
By: M Prashanth | 23 Oct 2026 3:21 PM ISTసినిమాల విషయంలో ఎవరికి వారు పోటీ పడినా.. పర్సనల్ రిలేషన్స్ దగ్గరకు వచ్చేసరికి స్టార్ హీరోల మధ్య మంచి రిలేషనే ఉంటుంది. మెయిన్ గా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఫ్రెండ్ షిప్ కంటిన్యూ అవుతోంది. మెగా ఫ్యామిలీతోనూ రజినీకి మంచి రిలేషన్ ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొందరు అభిమానులు వీరిద్దరి మధ్య కంపేరిజన్స్ పెడుతూ టైమ్ వేస్ట్ చేస్తుంటారు.
రీసెంట్ గా రజినీకాంత్ 'జైలర్-2' వసూళ్లను ప్రశంసిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఒక్క రజినీ గారికే సాధ్యమంటూ ఆయన స్టైల్ ను మెచ్చుకున్నారు. అయితే అల్లు అర్జున్ పోస్ట్.. చిరంజీవికి కౌంటర్ అంటూ కొందరు వేస్ట్ ట్రోల్స్ చేస్తున్నారు. కావాలానే క్రియేట్ చేసుకుని పోస్టులు పెడుతున్నారు.
నిజానికి ఇక్కడ చిరంజీవిని తీసుకురావాల్సిన అవసరమే లేదు. రజినీకాంత్ సాధించిన విజయాన్ని చూసి బన్నీ అభినందించారు. ఒక హీరోను మెచ్చుకోవడం అంటే మరో హీరోను తక్కువ చేయడం కాదు. కానీ సోషల్ మీడియాలో కొందరు మాత్రం ప్రతి విషయాన్ని కూడా తమకు నచ్చినట్లుగా పోల్చి చూస్తున్నారు. దీంతో అసలు విషయాన్ని పక్కన పెట్టి కొత్త వివాదాలకు తెరతీస్తున్నారు.
చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ తమ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో విజయాలు చూశారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలుగా ఎదిగినా పర్నసల్ గ ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవం తగ్గలేదు. అలాంటి వారి మధ్య అభిమానులు కంపేరిజన్స్ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా హీరోల మధ్య లేని విభేదాలను ఉన్నట్లుగా చూపించినట్లవుతుంది.
మెగా ఫ్యామిలీలో చిరంజీవి ప్లేస్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా రజినీకాంత్ కు కూడా ఆ ఫ్యామిలీలో గౌరవం ఉంది. రామ్ చరణ్ వంటి యంగ్ హీరోల విజయాలను రజినీ అభినందించడం, అల్లు అర్జున్ రజినీని ప్రశంసించడం చూస్తే సినీ ఇండస్ట్రీలో పర్సనల్ రెస్పెక్ట్ కు ఉన్న వాల్యూ అర్థమవుతుంది. ఇలాంటి రిలేషన్స్ ను అభిమానులు కూడా గౌరవించాల్సి ఉంటుంది. కానీ ఫ్యాన్ వార్స్ లో మాత్రం ఆ విషయాలన్నీ పక్కకు వెళ్లిపోతున్నాయి.
ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టింది, ఎవరు ఎవరిని పొగిడారు, ఎవరి రేంజ్ ఎంతనే చర్చలతో సమయం గడిపేస్తున్నారు. హీరోలు మాత్రం తమ పనిలో తాము ముందుకు వెళ్తున్నారు. ఒకరి విజయాన్ని మరొకరు అభినందించుకుంటున్నారు. ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎన్ని పోలికలు పెట్టినా చిరంజీవి స్థానం మారదు. మెగా ఫ్యామిలీతో రజినీకాంత్ కు ఉన్న అనుబంధమూ తగ్గదు. అభిమానులు గుర్తించాల్సింది ఇదే. హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని అర్థం చేసుకోకుండా, లేని పోటీని క్రియేట్ చేసుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదు. చివరకు మారేది ఏమీ లేకపోయినా.. వేస్ట్ పోస్టులతో టైమ్ వేస్ట్ చేసుకోవడం తప్ప మరో యూజ్ ఉండదు.
