హిట్ కొడితే అన్నయ్యతో లాంఛనమేనా!
మెగాస్టార్ చిరంజీవితో ఎప్పటికైనా సినిమా చేయాలన్నది డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కల.
By: Srikanth Kontham | 12 Sept 2025 8:00 PM ISTమెగాస్టార్ చిరంజీవితో ఎప్పటికైనా సినిమా చేయాలన్నది డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కల. అన్ని అనుకున్నట్లు జరిగితే అన్నయ కంబ్యాక్ తర్వాత పూరి సినిమానే చేయాలి. కానీ `ఆటోజానీ` కథ సెట్ అవ్వకపోవడంతో? అక్కడితో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ద్వితియార్ధం విషయంలో చిరంజీవి సంతృప్తిగా లేకపోవడంతో సాధ్యపడలేదు. అలాగని పూరి ఎక్కడా నిరుత్సాహ పడలేదు. ఆ సినిమా కాకపోతే మరో సినిమా చేస్తానని ఆనాడే ప్రకటించారు. అదే సమయంలో అన్నయ్య తో సినిమా తనకో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ వెల్లడించారు.
నెట్టింట మళ్లీ చర్చ మొదలు:
ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు తప్ప మళ్లీ కలుస్తున్నట్లు ఎక్కడా ప్రచారంలోకి రాలేదు. ఇదే సమయంలో పూరి చేసిన చాలా సినిమాలు ప్లాప్ లు అవ్వడంతో? అన్నయ్యతో కష్టమే నన్నది తేలిపోయిన అంశంగా వైరల్ అయింది. దీంతో ప్రేక్షకాభిమానులు కూడా ఆ కాంబినేషన్ గురించి మర్చిపోయారు. ఇండస్ట్రీ లోనూ ఎక్కడా చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చిరుతో పూరి సినిమా అంటూ మళ్లీ డిస్కషన్ మొదలైంది. అందుకు పూరి తీస్తోన్న తాజా చిత్రం విజయం ఒక్కటే ప్రామా ణికంగా తెరపైకి వస్తోంది.
మళ్లీ కలుస్తున్నారా?
ఈ విషయంలో చిరంజీవి కూడా పూరికి మాటిచ్చినట్లు మరో మాట కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం పాజిటివ్ గా వస్తే గనుక చిరంజీవి సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు, పూరికి సూచాయగా సంకేతాలు కూడా పంపినట్లు వినిపిస్తోంది. ఈ క్రమంలో చిరు-పూరి మధ్య ఫోన్ సంభాషణ కూడా జరిగిందంటున్నారు. బాలీవుడ్ లో అమితాబచ్చన్ డైరెక్ట్ చేసావ్? నాకెందుకు కథ రాయలేకపోతున్నావ్? చెప్పూ అంటూ చిరు ఆట పట్టించారట.
హిట్ కీలకం అందుకే:
అందుకు పూరి మీ ఇమేజ్ ని అందుకునే కథ రాయాలంటే సమయం పడుతుంని ...అందుకోసం తనని ఓ ఆరు నెలలు పాటు వదిలేస్తే రాసుకుని వస్తానని చెప్పారుట. ఇది జరగాలంటే? పూరి కి హిట్ కూడా అంతే కీలకం. విజయ్ సేతుపతి సినిమాతో మంచి హిట్ కొట్టాడంటే? పూరి ఈజ్ బ్యాక్ అయినట్లే. అప్పుడు చిరంజీవితో పాటు చాలా మంది స్టార్లు ముందుకొస్తారు. బాలయ్య, వెంకటేష్, నాగ్ లాంటి సీని యర్లు కూడా మేము రెడీ అంటారు. అదే ప్లాప్ తో ఛాన్స్ అడగాలంటే పూరికి కూడా మనసు రాదు. అందుకే ఇండస్ట్రీలో హిట్ అన్నది అంత కీలకం.
