చిరంజీవి పెద్ద కొడుకులా కుమార్తె!
నిన్నటి రోజున ఈవెంట్ లో మెగాస్టార్ తన భుజం కాస్తోన్న మరో తనయుడిగా సుస్మితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో తండ్రికి ఎంతగా సేవలందిస్తున్నారు.
By: Srikanth Kontham | 9 Jan 2026 1:04 AM ISTమెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రామ్ చరణ్ పెద్ద స్టార్ అయ్యాడు. చిత్ర రంగంలో తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్నాడు. `ఆర్ ఆర్ ఆర్` తో పాన్ ఇండియాలో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. అదే సక్సెస్ తో గ్లోబల్ స్థాయిలోనూ చరణ్ పేరు మారుమ్రోగింది. హాలీవుడ్ లో సైతం అవకాశాలు వస్తున్నాయి. అంతగా రామ్ చరణ్ కెరీర్ సక్సెస్ కనిపిస్తుంది. చరణ్ ఎదుగుదలను చూసి ఓ తండ్రిగా చిరంజీవి ఎంతో గర్విస్తున్నారు. ఓ తండ్రిగా చిరంజీవి తనయుడిని నుంచి ఆశించేది ఇంకేముంటుంది. తనయుడు ఎంత బిజీగా ఉన్నా? తండ్రి విషయంలో అంతే చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు.
అలాగే తనయల విషయంలో కూడా చిరంజీవి అంతే సంతోషంగా ఉన్నారు. పెద్ద కుమార్తె సుస్మిత సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించి `మనశంకరవరప్రసాద్ గారు` సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఇంత వరకూ కాస్ట్యూమ్ డిజైనర్ గా కెమెరా వెనకే ఉన్నా? సుస్మిత నిర్మాతగా ముందుకు రావడం పట్ల చిరంజీవి ఎంతో గర్విస్తున్నారు. నిర్మాణ రంగంలో రాణించాలనే తనయ తపన చూసి తండ్రి ఎంతో మురిసిపోతున్నారు. కూర్చుని తిన్నా? తరగనంత ఆస్తి ఉన్నా? ఏదో సాధించాలనే తనయ తపనకు చిరంజీవి తన వంతు సహకారం అందిస్తున్నారు.
నిన్నటి రోజున ఈవెంట్ లో మెగాస్టార్ తన భుజం కాస్తోన్న మరో తనయుడిగా సుస్మితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో తండ్రికి ఎంతగా సేవలందిస్తున్నారు. అన్నది అద్దం పడుతుంది. రామ్ చరణ్ వారసుడే అయినా? కుమార్తె రూపంలో సుస్మిత పెద్ద కొడుకలా వ్యవహరిస్తుందని చిరు మాటల్లో స్పష్టమవుతోంది. చిత్ర రంగంలో తనయ కూడా ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని అన్నయ్య ఆకాంక్షించారు. మరి సుస్మిత ఇండస్ట్రీలో నిర్మాతగా ఎలాం టి స్ట్రాటజీతో ముందుకెళ్తారో చూడాలి. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ కంటే ముందు చిరంజీవి సొంతంగా తన ఇంటి పేరుతోనే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కానీ అందులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ ఆ సంస్థ కారణంగా సుస్మిత ప్రొడక్షన్ పై కొంత వరకూ గ్రిప్ సంపాదించారు. అదే కాన్పిడెన్స్ తో సొంతంగా గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను ప్రారంభించారు. మరి ఈ ప్రయాణంలో ఎలాంటి శిఖరాలు అధిరోహిస్తారో చూడాలి. అలాగే రెండవ సినిమా ఏ హీరోతో చేస్తున్నారు? అన్నది కూడా ఇంకా వెల్లడించలేదు. `మన శంకర వరప్రసాద్ గారు` రిలీజ్ అనంతరం రెండవ చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
