Begin typing your search above and press return to search.

కమెడియన్ సత్యకు మెగా ఎలివేషన్స్.. మామూలుగా లేవుగా!

రీసెంట్ గా జరిగిన 'కొరియన్ కనకరాజు' మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతోంది.

By:  M Prashanth   |   12 Aug 2026 10:28 AM IST
కమెడియన్ సత్యకు మెగా ఎలివేషన్స్.. మామూలుగా లేవుగా!
X

రీసెంట్ గా జరిగిన 'కొరియన్ కనకరాజు' మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతోంది. సినిమా ఈవెంట్స్ లో చిరు మాట్లాడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అయితే ఈసారి ఆయన ముఖ్యంగా కమెడియన్ సత్య గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సత్య కామెడీ టైమింగ్, అతని స్పాంటేనిటీపై మెగాస్టార్ ఏకంగా మెగా రేంజ్ లో కాంప్లిమెంట్స్ ఇవ్వడం ప్రెజెంట్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ గాంధీ ఎంత కారణమో, సత్య కామెడీ కూడా అంతే స్ట్రాంగ్ రీజన్ అని చిరంజీవి ఓపెన్ గా చెప్పారు. సత్య నటించిన సినిమాలు తాను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటానని ఆయన వెల్లడించారు. గతంలో తనతో కలిసి నటించినప్పుడు కూడా సత్య యాక్టింగ్ స్టైల్ ని తాను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశానని, స్క్రీన్ మీద అతని నటనకు ఎలాంటి లిమిటేషన్స్ ఉండవని చిరు మెచ్చుకోవడం విశేషం.

కెమెరా ముందు యాక్టింగ్ చేసేటప్పుడు సత్యకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, సీన్ కు తగ్గట్టుగా తన మనసుకు ఏది అనిపిస్తే అది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తాడని చిరు చెప్పారు. తనకున్న మిమిక్రీ టాలెంట్ ను కూడా వాడుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేసే విధానమే సత్య అసలైన బలం అని ఆయన అప్రిషియేట్ చేశారు. పాత్ర ఏదైనా సరే ఆ స్పాంటేనిటీ వల్లే ఆడియన్స్ అంతలా అతనికి కనెక్ట్ అవుతున్నారని ఆయన తన స్పీచ్ లో క్లియర్ గా చెప్పుకొచ్చారు.

సత్య కామెడీలో ఉన్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే, అతను చేసిన సీన్స్ ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చిరంజీవి అన్నారు. థియేటర్లలో ఆడియన్స్ ని అంతలా నవ్విస్తూ, ఎంతోమంది ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నందుకు వాళ్ళ బ్లెస్సింగ్స్ కచ్చితంగా సత్య ఖాతాలో చేరుతాయని ఆయన చెప్పారు. టాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్స్ ని చూసిన ఒక లెజెండరీ యాక్టర్ నుంచి ఇలాంటి మాట రావడం సత్య కెరీర్ కు నిజంగా చాలా పెద్ద బూస్ట్ అని ఇండస్ట్రీ జనాలు కూడా అంటున్నారు.

ఇక సినిమా టీమ్ ని ఉద్దేశించి ఆయన వాడిన ఒక కంపారిజన్ ఆ ఈవెంట్ కే హైలైట్ అని చెప్పాలి. ఈ మూవీ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గాంధీ ఒక పవర్ ఫుల్ ఇంజిన్ అయితే, హీరో వరుణ్ తేజ్ ఒక ఐరన్ పిల్లర్ లాంటివాడని చిరు అన్నారు. అయితే ఆ ఐరన్ పిల్లర్ మీద కట్టిన కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ గా నిలబడాలంటే అందులో సత్య లాంటి సాలిడ్ కాంక్రీట్ కచ్చితంగా ఉండాలని ఆయన చెప్పిన డైలాగ్ కి అక్కడున్న వాళ్ళంతా ఫిదా అయిపోయారు.

సత్య లాంటి యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఎప్పుడూ తనను అభిమానిస్తామని, తన ఫ్యాన్స్ అని చెప్తుంటారని చిరు అన్నారు. కానీ తెరపై వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు తనకు కలిగే ఆనందం వాళ్ళ అభిమానం కంటే ఎంతో గొప్పగా ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా, మనస్ఫూర్తిగా ముగించారు. ఇక మెగాస్టార్ లాంటి పెద్ద హీరో దగ్గర్నుంచి కమెడియన్ సత్య కు దక్కిన ఈ మెగా ఎలివేషన్స్ అతని భవిష్యత్తుకి ఇంకాస్త బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పవచ్చు.