మెగాస్టార్ ఇంట్లో వాళ్లను కాదని మరీ..
సినిమా బావుంటే వాళ్లు స్టార్ హీరోలా, ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన కొత్త వాళ్లా అనేది పట్టించుకోకుండా వారిని ఇంటికి పిలిచి మరీ అభినందిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి.
By: Sravani Lakshmi Srungarapu | 31 Jan 2026 1:03 PM ISTసినిమా బావుంటే వాళ్లు స్టార్ హీరోలా, ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన కొత్త వాళ్లా అనేది పట్టించుకోకుండా వారిని ఇంటికి పిలిచి మరీ అభినందిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. అలా ఆయన ఇప్పటికే వేరే వాళ్లు చేసిన ఎన్నో సినిమాలను చూసి, ఎంతో మందిని అభినందించిన సందర్భాలున్నాయి. కొన్ని సార్లు వారిని స్టేజ్ మీద అందరి ముందు అభినందిస్తే, మరికొన్ని సార్లు ఇన్‌డైరెక్ట్ గా అభినందిస్తూ వచ్చారు.
ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని కూడా మెగాస్టార్ అలానే అభినందించినట్టు డైరెక్టర్ బాబీ వెల్లడించారు. నవీన్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడని, ఈ జెనరేషన్ హీరోల్లో తనకు నచ్చే హీరో నవీన్ అని అన్నయ్య తనతో అన్నారని, ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పాలనే కారణంతోనే ఇప్పటివరకు నవీన్ కు కూడా చెప్పలేదని బాబీ చెప్పడంతో నవీన్ మురిసిపోయారు.
అయితే నవీన్ ను, అతని యాక్టింగ్ ను, ఎనర్జీని మెగాస్టార్ పొగిడి ఉంటే ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు కానీ ఏకంగా ఈ జెనరేషన్ లో వస్తున్న హీరోల్లో నవీన్ అంటే ఇష్టమని చెప్పడంతో అందరూ షాకవుతున్నారు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీలోనే ఈ జెనరేషన్ హీరోలు చాలా మంది ఉన్నారు. తనకు నచ్చిన వారిని తన ఫ్యామిలీ నుంచి కాకుండా బయట వారిని చెప్పడం అందరినీ ఆశ్యర్యపరిచింది.
గతంలో శర్వానంద్ ను ఇలాగే పొగిడిన మెగాస్టార్
తన ఫ్యామిలీలోని హీరోలను కాదని మరీ ఇలా బయటి హీరోని తన ఫేవరెట్ హీరో అని చెప్పడం కొంచెం ఆశ్చర్యం కలిగించినప్పటికీ, నవీన్ టాలెంట్ ను చూసే ఆయన ఇలా చెప్పి ఉంటారని అందరూ భావిస్తున్నారు. గతంలో తన కంబ్యాక్ సినిమా ఖైదీ నెం.150 సినిమాతో పాటూ సంక్రాంతికి వచ్చిన శర్వానంద్ శతమానం భవతి హిట్ అయినప్పుడు కూడా మెగాస్టార్ ఇదే తరహాలో శర్వానంద్ ను అభినందించడమే కాకుండా, ఏకండా సక్సెస్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వెళ్లి చిత్ర యూనిట్ ను ఆశీర్వదించారు.
ఇక అనగనగా ఒక రాజు విషయానికొస్తే నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో నవీన్ సెన్సాఫ్ హ్యూమర్, అతని కామెడీ విధానం, సినిమాను నవీన్ భుజాలపై మోసిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
