Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ గాయం.. ఆ వైద్యుడికి మెగాస్టార్ ఫిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి ఇటీవల చిన్నపాటి గాయం అయిన విషయం తెలిసిందే. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన కంటికి గాయమైందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

By:  M Prashanth   |   26 March 2026 11:03 AM IST
రామ్ చరణ్ గాయం.. ఆ వైద్యుడికి మెగాస్టార్ ఫిదా
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి ఇటీవల చిన్నపాటి గాయం అయిన విషయం తెలిసిందే. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ఆయన కంటికి గాయమైందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు దెబ్బ తగలడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అయితే ఈ విషయంపై స్వయంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

చరణ్ కంటి రెప్పకు తగిలిన గాయం కారణంగా డాక్టర్ సుధాకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు. సకాలంలో స్పందించి ఎంతో నైపుణ్యంతో చికిత్స అందించినందుకు చిరంజీవి సదరు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఫొటో పోస్ట్ చేసి మరీ కృతజ్ఞత చూపడం వీరి స్పెషల్. ఈ సర్జరీ తర్వాత చరణ్ కంటి సమస్య పూర్తిగా తొలగిపోయిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం.

కంటి రెప్ప వంటి సున్నితమైన భాగం కావడంతో మెగా కుటుంబం మొదట కాస్త కంగారు పడినా, సర్జరీ సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి నిన్ననే 'పెద్ది' చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఈ గాయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. గాయం చాలా చిన్నదే అని, షూటింగ్ షెడ్యూల్స్ లో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు చిరంజీవి స్వయంగా డాక్టర్ కు థాంక్స్ చెబుతూ పోస్ట్ చేయడంతో ఆ గాయం తాలూకు చికిత్స పూర్తయిందని క్లారిటీ వచ్చేసింది.

షూటింగ్ లో గాయం జరిగిన వెంటనే మేకర్స్ అప్రమత్తమై చికిత్స చేయించినట్లు అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్ లో డాక్టర్ సుధాకర్ ప్రసాద్ ఫోటోను కూడా షేర్ చేశారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు, ఎంతో కేర్ తీసుకున్నందుకు డాక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒక పెద్ద స్టార్ అయి ఉండి కూడా వైద్యుడి సేవలను గుర్తించి అభినందించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో మెసేజెస్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం చరణ్ ఎంతో కష్టపడుతున్నారు. మార్చి 27న ఆయన పుట్టినరోజు సందర్భంగా రానున్న అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే సుకుమార్ తో కూడా మరో సినిమాను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.