మెగా ఫ్యామిలీకి OG స్పెషల్ షో.. మెగాస్టార్ రెస్పాన్స్ ఇదే
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ` థియేటర్లలో విడుదలై భారీ ఓపెనింగులు సాధించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 30 Sept 2025 9:30 AM ISTపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ` థియేటర్లలో విడుదలై భారీ ఓపెనింగులు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్రకటించింది చిత్రబృందం. నవతరం దర్శకుడు సుజీత్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ గ్యాంగ్ స్టర్ డ్రమాని వీక్షించాల్సిందిగా ప్రముఖులకు స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మెగా కుటుంబం మొత్తం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో `ఓజీ` స్పెషల్ షోలో సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
ఆసక్తికరంగా మెగాస్టార్ చిరంజీవి- ఓజీ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి ఈ ప్రత్యేక షోని వీక్షించారు. పవన్ వైరల్ ఫీవర్ నుంచి కోలుకుని ఇప్పుడు ఉత్సాహంగా కనిపించారు. రామ్ చరణ్, అకీరా నందన్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ఇతర మెగా మనవలు, మనవరాళ్లు కూడా హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్ సహా మెగా కుటుంబం స్పందన ఎలా ఉంటుందో చూడటానికి మీడియా సహా చాలా మంది ప్రసాద్ లాబ్స్ లో వేచి చూసారు.
`దే కాల్ హిమ్ ఓజీ` వీక్షించిన అనంతరం చిరంజీవి మీడియా ఎదుట.. ``మాటల్లేవ్... సూపర్బ్... సూపర్బ్... సూపర్బ్`` అని వ్యాఖ్యానించారు. చరణ్ కూడా సింపుల్ గా థమ్సప్ సిగ్నల్ ఇచ్చాడు. ఓజీ ప్రత్యేకించి పవన్ కల్యాణ్ మాసిజాన్ని ఎలివేట్ చేయడానికి తెరకెక్కించిన సినిమా. కథ కంటే ఎలివేషన్స్ డామినేట్ చేసాయని విమర్శలు ఉన్నా, ఇది పవన్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసాధారణ మాస్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షించింది.
సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మి, ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. థమన్ సంగీతం అందించారు.
