Begin typing your search above and press return to search.

మెగా క్యామియో.. అంత ఈజీగా ఎలా అవుతుంది బాసు..?

ఐతే ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్ ఫాదర్ రోల్ చేస్తారన్న వార్తలు అటు ఇటు చేరి మెగా కాంపౌండ్ దాకా చేరాయి. ఐతే అక్కడ నుంచి ఈ వార్తలకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   29 Sept 2025 6:00 PM IST
మెగా క్యామియో.. అంత ఈజీగా ఎలా అవుతుంది బాసు..?
X

సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి క్యామియో ఉంటుందన్న న్యూస్ వైరల్ అయ్యింది. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నటిస్తున్నాడు. యానిమల్ తర్వాత సందీప్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఐతే ప్రభాస్ స్పిరిట్ లో మెగాస్టార్ ఫాదర్ రోల్ చేస్తారన్న వార్తలు అటు ఇటు చేరి మెగా కాంపౌండ్ దాకా చేరాయి. ఐతే అక్కడ నుంచి ఈ వార్తలకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది.

చిరంజీవి సపోర్టింగ్ రోల్స్..

ప్రభాస్ సినిమాలో ఫాదర్ రోల్ గా చిరంజీవి నటించట్లేదట. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరతో పాటు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన మన శంకర వరప్రసాద్ సినిమా మీదే తన పూర్తి ఫోకస్ పెట్టారు. అంతేకానీ ఎలాంటి స్పెషల్ క్యామియోస్ కానీ సపోర్టింగ్ రోల్స్ కానీ చేయట్లేదని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో డిజాస్టర్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో పనిచేస్తున్నారు.

మెగా విశ్వంభర వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వల్ల రిలీజ్ లేట్ అవుతూ వస్తుంది. మరోపక్క మన శంకర వరప్రసాద్ సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలతోనే చిరంజీవి బిజీ బిజీగా ఉన్నారు. ఈ టైంలో అసలు ఎలాంటి క్యామియో రోల్స్ కి ఓకే చెప్పే ఛాన్స్ కనిపించట్లేదు. సందీప్ వంగ మెగాస్టార్ కి పెద్ద అభిమాని ఒకవేళ ఆయన అడిగితే కాదంటారా అంటే కాదనకపోవచ్చు కానీ సందీప్ వంగానే చిరుని అలా క్యామియో రోల్ లో కాకుండా ఆయనతో సినిమా తీసేలా ప్రయత్నిస్తాడు.

స్పిరిట్ లో ఫాదర్ రోల్..

సో ప్రభాస్ స్పిరిట్ లో చిరంజీవి అన్న న్యూస్ ఒక రూమర్ మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ ఒక క్రేజీ మూవీగా రాబోతుంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాతో చిరు మాస్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక విశ్వంభర సినిమా భారీ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ రెండు సినిమాలు కూడా మెగాస్టార్ మెగా మేనియా ఏంటో చూపిస్తాయని గట్టిగా చెబుతున్నారు.

సందీప్ వంగ స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి ఫాదర్ రోల్ అన్న న్యూస్ కి దాదాపు ఆన్సర్ వచ్చినట్టే. ఐతే చిరంజీవితో సందీప్ తీస్తే ఒక ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తాడు కానీ క్యామియోలతో సరిపెడతాడని అనుకోలేం. సో చిరంజీవిని ప్రభాస్ సినిమాలో చూస్తామా అన్న ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ కి ఎండ్ కార్డ్ పడిందనే చెప్పొచ్చు.