మెగా కుటుంబంలో పాప్ సింగర్.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
By: Madhu Reddy | 10 Jan 2026 3:13 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మెగా కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా ఈ మెగా కుటుంబం నుండి చాలామంది హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. పైగా హీరోయిన్ గా మెగా డాటర్ నిహారిక ట్రై చేసింది కానీ పెద్దగా వర్కౌట్ కాక ఇప్పుడు నిర్మాతగా సెటిలైపోయింది.. అలాగే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా నిర్మాతగానే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ మెగా కుటుంబంలో పాప్ సింగర్ కూడా ఉన్నారని, ఆమె ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో తన అద్భుతమైన గొంతును వినిపించారు అని డైరెక్టర్ అనిల్ రావిపూడి సీక్రెట్ రివీల్ చేయడంతో మెగా అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి మన మెగా కుటుంబం నుండి పాప్ సింగర్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర పోషించారు. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టారు చిత్రబృందం. అందులో భాగంగానే అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఈ సినిమా గురించి, ఈ సినిమాలో తనకు నచ్చిన పాటల గురించి, అలాగే ఇందులో పాట పాడిన ఫోక్ సింగర్ గురించి స్పందించారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.." ఈ సినిమా నుండి ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల చేయగా.. ఒక్కో పాట ఒక్కో విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాకు మొదట మీసాల పిల్ల చాలా ఇష్టం. ఆ తర్వాత శశిరేఖ సాంగ్.. ఇక హుక్కు స్టెప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అసలు వేటితో కూడా ఆ స్టెప్పును కంపేర్ చేయలేము. ఎందుకంటే చిరంజీవి ప్రాణం పెట్టి ఆ స్టెప్ వేశారు. చిరంజీవి వెంకీ కాంబినేషన్లో వచ్చిన పాట మరింత ఇష్టం. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట కన్నుల పండుగ లాంటిది. ఈ నాలుగు పాటలు కూడా నాలుగు డిఫరెంట్ వేలో నాకు నచ్చాయి. ఇక ఇంకా రెండు పాటలు మిగిలే ఉన్నాయి. వాటిని మేము రిలీజ్ చేయలేదు.
ముఖ్యంగా చిరంజీవికి, పిల్లలకి మధ్య ఒక మాంటేజ్ సాంగ్ ఉంది. అది చాలా అద్భుతంగా వచ్చింది. దానిని చిరంజీవి మేనకోడలు పాడారు. ఆమె చిరంజీవి సోదరి కూతురు.. ఆమె ఒక పాప్ సింగర్ . ఇందులో ఆమె చాలా అద్భుతంగా పాడారు. సక్సెస్ తర్వాత ఆ పాటను రిలీజ్ చేస్తాము" అంటూ అనిల్ రావిపూడి తెలిపారు. మొత్తానికి అయితే చిరంజీవి మేనకోడలు ఒక పాప్ సింగర్ అని, పైగా ఆమె ఇందులో ఒక ఫోక్ సాంగ్ పాడారు అని చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
