Begin typing your search above and press return to search.

చిరంజీవి నెక్స్ట్ మూవీ మీద సస్పెన్స్ వీడిందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి.

By:  Gopi Velupala   |   26 Oct 2026 12:00 AM IST
చిరంజీవి నెక్స్ట్ మూవీ మీద సస్పెన్స్ వీడిందా?
X

తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేసే సినిమాలు మాస్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటాయి. కెరియర్ మొదటి నుంచి చిరంజీవి మాస్ ప్రేక్షకులను అలరించడం సక్సెస్ అవుతున్నాడు.

నెక్స్ట్ మూవీ డైరెక్టర్?

చిరంజీవి తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తుండటం విశేషం. గతంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. చిరంజీవి వేరే దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దాంతో పాటుగా హరీష్ శంకర్, మారుతి పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి. వీళ్ళందరు రీసెంట్ గా చిరంజీవికి కథలను వినిపించారు. కానీ చిరంజీవి ఎవ్వరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్న కమర్షియల్ డైరెక్టర్లు అందరినీ లైనప్ లో పెట్టుకున్నారు. ఎవరితో ముందు సినిమా చేస్తారు ఎంతమందిని హోల్డ్ లో పెడతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది... తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో తొందర్లోనే కన్ఫర్మ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాకా పై భారీ అంచనాలు...

ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న 'కాకా' సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో మరోసారి చిరంజీవికి భారీ సక్సెస్ ని ఇస్తానంటూ బాబీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. వీళ్ళ కాంబో కి చాలా మంచి క్రేజ్ వచ్చింది. చిరంజీవి తన సినిమా కోసం డైరెక్టర్లు సెలెక్ట్ చేయడానికి చాలా రకాలుగా ఆలోచిస్తాడు. కారణం సక్సెస్ ఫుల్ సినిమా తీస్తాడా లేదా అనేది పక్కన పెడితే తనకి సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది. సినిమా కోసం ఎంతలా కష్టపడతాడు అనేది చూసి సినిమా ఇస్తాడనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. వశిష్ఠ డైరెక్షన్ లో చేసిన విశ్వంభర తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ రెండు ప్రాజెక్ట్ లతో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద విజృంభించడానికి సిద్ధమవుతున్నారు.