మెగాస్టార్ 158 కోసం కనకవతినే దించుతున్నారా?
తాజాగా అదిరిపోయే బ్యూటీ పేరు వినిపిస్తోంది. చిరుకు జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ తో సంప్రదింపులు జరుపుతున్నారుట.
By: Srikanth Kontham | 9 Nov 2025 2:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం బాబి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. `వాల్తేరు వీరయ్య` తర్వాత ఇద్దరు మరోసారి చేతులు కలిపిన చిత్రమిది. మెగా మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాబి మార్క్ మాస్ చిత్రంగా ఉండ బోతుంది. అయితే ఈసారి కథ కోసం గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేసాడు బాబి. మరీ రెగ్యులర్ సినిమా లా కాకుండా తెరపై ఓ కొత్త కథని మాస్ కోణంలో చెప్పబోతున్నాడు. `వాల్తేరు వీరయ్య` మెగా ఇమేజ్ తో ఆడిన చిత్రం తప్ప అందులో బాబి కొత్తగా చెప్పిందేం లేదు. ఈ నేపథ్యంలో చిన్నపాటి విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆ విషయంలో రాజీ పడని నటుడాయన:
ఈసారి వాటికి తావు ఇవ్వకుండా పక్కాగా ప్లాన్ చేసుకుని బరిలోకి దిగుతున్నాడు. ఇక చిరంజీవికి హీరోయిన్ ని ఎంపిక చేయడం అన్నది డైరెక్టర్ల కి ఎంత క ష్టమవుతుందో చెప్పాల్సిన పనిలేదు. వయసు 70 కావడంతోనే నాయిక అనే ఆలోచన వచ్చిన ప్రతీసారి అన్ని భాషల వైపు చూడాల్సి వస్తోంది. ఇలా ఎన్ని చేసినా మళ్లీ ఆ పాత హీరోయిన్లనే రిపీట్ చేయాల్సి వస్తోంది. హీరోయిన్ల విషయంలో డైరెక్టర్లు రాజీ పడినా చిరంజీవి రాజీ పడరు. తన వయసును మ్యాచ్ చేసే హీరోయిన్ అయితేనే చేస్తానంటారు? రవితేజలా 30 ఏళ్ల నటి అయితే చిరు ఒప్పుకోరు.
చిరంజీవికి జోడీగా ఆ బ్యూటీ:
అందుకే చిరంజీవితో సినిమా అంటే డైరెక్టర్లకు కొంత ఇబ్బందిగా మారుతుంది. దీంతో బాబి మాత్రం ఈసారి చిరుకు పర్పెక్ట్ గా సూట్ అయ్యే నటినే దించుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రుతి హాసన్, అనుష్క అంటూ కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినా? తాజాగా అదిరిపోయే బ్యూటీ పేరు వినిపిస్తోంది. చిరుకు జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ తో సంప్రదింపులు జరుపుతున్నారుట. చిరు వయసును ఆమె మ్యాచ్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారుట. ఇటీవలే రిలీజ్ అయిన `కాంతార చాప్టర్ వన్` లో రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి నటించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ స్లిమ్ లుక్ తో పర్పెక్ట్ గా:
రిషబ్ శెట్టి వయసు 42 ఏళ్లు అయినా? 50 ఏళ్ల నటుడిలా ఉంటాడు. భారీ దేహం...ఆహార్యం వయస్కుడినే తలపిస్తుంది. ఆయనకు జోడీగా రుక్మిణి పర్పెక్ట్ గా సెట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె చిరుకు పక్కాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారుట. చిరంజీవి స్లిమ్ లుక్ నెట్టింట వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి 40 ఏళ్ల వయస్కుడిగా కనిపిస్తున్నారు. లుక్ పరంగా మార్పులు తీసుకు రావడంతో? హీరోయిన్లు మ్యాచ్ అవుతారు. ఈ నేపథ్యంలో రుక్మిణిని లైన్ లోకి తెస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది.
