Begin typing your search above and press return to search.

కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు

తదుపరి సినిమాల కోసం చిరంజీవి కొత్త తరహా దర్శకుల కథలను పరిశీలిస్తున్నట్లు టాక్. కార్తీక్ సుబ్బరాజ్, మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి ఆయనకు కథలు వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌పై ఇంకా స్పష్టత లేదు. వచ్చే ఏడాది వేసవి తర్వాత కొత్త సినిమాను ప్రారంభించి, 2028 సంక్రాంతికి విడుదల చేయాలని చిరు భావిస్తున్నట్లు సమాచారం.

By:  M Prashanth   |   10 Nov 2026 12:26 PM IST
కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు
X

చిరంజీవి తదుపరి ప్రాజెక్టుల విషయంలో రకరకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ టాలీవుడ్ కమర్షియల్ మేకర్స్ తోనే ప్రయాణం చేస్తున్న మెగాస్టార్, ఈసారి పొరుగు ఇండస్ట్రీల న్యూ ఏజ్ టాలెంట్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్, తరుణ్ మూర్తి లాంటి వాళ్లు చిరును కలిసి కథలు వినిపించారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంకా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనప్పటికీ, ఆయన ఆలోచనల్లో ఒక మార్పు అయితే కనిపిస్తోంది.

రీఎంట్రీ తర్వాత బాబీతో వాల్తేరు వీరయ్య, మెహర్ రమేష్‌తో భోళా శంకర్ చేసిన చిరు, ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర, బాబీతో కాకా చేస్తున్నారు. ఇవన్నీ దాదాపు తెలిసిన కమర్షియల్ చట్రంలో సాగేవే. రొటీన్ ఫార్ములాను దాటి కొత్త తరహా నెరేషన్ కోరుకుంటున్న మెగా ఫ్యాన్స్ పల్స్ ను చిరంజీవి గమనించినట్లున్నారు. అందుకే ఇతర భాషల్లో విలక్షణ శైలితో హిట్లు కొట్టిన మేకర్స్ కథలపై ఫోకస్ పెడుతున్నారు.

ముఖ్యంగా కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. జిగర్తాండ, మహాన్, పేట లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. రజనీకాంత్ ను పేట చిత్రంలో ప్రెజెంట్ చేసిన తీరు చూశాక, చిరంజీవి మాస్ స్వాగ్ ను కార్తీక్ టేకింగ్ తో చూస్తే సరికొత్త మ్యాజిక్ పడుతుందని భావిస్తున్నారు. చిరుకు ఆయన వినిపించిన లైన్ చాలా భిన్నంగా ఉన్నట్లు టాక్.

మరోవైపు మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. మోహన్‌లాల్ తో ఆయన చేసిన తుడరుమ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. బలమైన భావోద్వేగాలతో పాటు ఒక పెద్ద స్టార్ ఇమేజ్ ను డీసెంట్ గా ఎలా ఎలివేట్ చేయవచ్చో నిరూపించారు. గతంలో చిరు ఇలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు కాబట్టి, తరుణ్ స్క్రిప్ట్ వర్కవుట్ అయితే క్లాసిక్ కాంబో అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో గతంలో అనుకున్న ప్రాజెక్ట్ పరిస్థితి ప్రస్తుతానికి డైలమాలోనే ఉంది. నానితో అతను తెరకెక్కించిన ప్యారడైజ్ మూవీ టాక్ తర్వాత ఈ కాంబినేషన్ పై అనుమానాలు బలపడ్డాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ప్రస్తుతానికైతే చిరు తొందరపడకుండా వెయిట్ అండ్ సీ ధోరణిలోనే ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ పక్కాగా కుదిరితేనే ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కాకా, విశ్వంభర లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ కోసం మెగావర్స్ అనే టాక్ షో కూడా చేస్తున్నారు. ఈ లైనప్ మధ్యలోనే కొత్త కథలను ఫైనల్ చేసుకునేందుకు చిరుకు తగినంత సమయం దొరికింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, 2028 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. మరి ఈసారి పక్క రాష్ట్రాల దర్శకులతో చిరంజీవి వేసే అడుగులు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.