'జైలర్' ని బరిలోకి దించుతోన్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి దర్శకుల విషయంలో ఎంత సెలక్టివ్ గా ఉన్నారు? అన్నది అతని లైనప్ చూస్తేనే తెలుస్తోంది.
By: Srikanth Kontham | 26 Aug 2025 7:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి దర్శకుల విషయంలో ఎంత సెలక్టివ్ గా ఉన్నారు? అన్నది అతని లైనప్ చూస్తేనే తెలుస్తోంది. ఫాంలో ఉన్న స్టార్ మేకర్లను రంగంలోకి దించుతున్నారు. అనుభవం కంటే? స్ట్రాంగ్ కంటెంట్ ఎవరు తీసుకొస్తున్నారో చూసుకుని ఎంపిక చేస్తున్నారు.'విశ్వంభర' చిత్రం అలా కమిట్ అయిందే. వశిష్ట డైరెక్టర్ గా చేసింది 'బింబిసార' ఒక్కటే. కానీ ఆ సినిమా విజయం..అందులో కంటెంట్ మెగాస్టార్ ని లైక్ చేసింది. దీంతో మరో ఆలోచన లేకుండా 'భోళా శంకర్' అనంతరం కమిట్ అయి పట్టాలెక్కించారు.
కొత్త ప్రాజెక్ట్ లైన్ లోకా:
'విశ్వంభర' పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో చిరు బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయంగా ప్రచారం జరుగుతోంది. అలాగే 157వ సినిమాను అనీల్ రావిపూడి దర్శకత్వం లోనూ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మరి తదుపరి 158వ సినిమా సంగతేంటి? అంటే చిరు ఆ ప్రాజెక్ట్ ను కూడా సెట్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. దీనికి సంబంధించి చిన్న గుసు గుస వినిపిస్తుంది.
స్నేహంతోనా? సినిమా కోసమా?
'జైలర్' తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ కు చిరు టచ్ లోకి వెళ్లినట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఇద్దరి మధ్య హైదరాబాద్ లో ప్రెండ్ లీ మీట్ జరిగిందట. 'జైలర్2' విఎఫ్ ఎక్స్ పనుల్లో భాగంగా నెల్సన్ హైదరాబాద్ రావడంతో ఆ సమయంలోనే చిరంజీవి ఆహ్వానం మేరకు కలిసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్త లొస్తున్నాయి. మరి ఈ ఆహ్వానం కాంబినేషన్ లో సినిమా కోసమా? జస్ట్ ప్రెండ్లీ మీట్ నా? అన్నది తేలాలి. అందుకు చాలా సమయం పడుతుంది.
ప్రస్తుతం చిరంజీవి 157 పైనే ఫోకస్ పెట్టి పని చేస్తున్నారు. 'విశ్వంభర'కు సంబంధించి సీజీ పనులు జరుగుతున్నాయి. ఓ వైపు ఆ సినిమా అప్ డేట్స్ తెలుసుకుంటూ 157 కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనీల్ కొత్త షెడ్యూళ్ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.
