157 లో మెగాస్టార్ మార్క్ సిగ్నేచర్ స్టెప్స్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మనశంకర వరప్రసాద్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 6 Sept 2025 12:13 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `మనశంకర వరప్రసాద్` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆద్యంతం హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. కొన్ని దశా బ్దాల తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న పక్తు కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం. చిరంజీవి ఎంతో ఇష్టపడి చేస్తోన్న చిత్రం కూడా. అనీల్ కామెడీ స్క్రిప్ట్ కి చిరు మార్క్ కామెడీ టింజ్ తోడైందంటే? అది నెక్స్ట్ లెవల్లోనే ఉంటుందని అంచనాలు బలంగా ఉన్నాయి. ఇందులో మెగాస్టార్ కు జోడీగా నయనతార నటించడం మరో విశేషం.
నో చెప్పే నటులు కాదు:
మరి ఈ చిత్రంలో పాటలకు, రొమాన్స్ కు ఎంత స్కోప్ ఉందంటే? అనీల్ ఈ విషయాలో కాస్త ఛాన్స్ తీసు కుంటున్నట్లే కనిపిస్తోంది. కథలో కేవలం కామెడీనే మాత్రమే జొప్పించకుండా అవసరం మేర హాస్యం లోనే రొమాన్స్ కూడా పండిచబోతున్నాడు. కామెడీ నేపథ్యంలోనే వచ్చే సన్నివేశాల్లో నయన్ తో రొమాం టిక్ డైలాగులు...చిన్న పాటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయన్నది తాజా సమాచారం. పాటల్లో సైతం అంతే రొమాన్స్ హైలైట్ అవుతుంది. ఇలాంటి సన్నివేశాల విషయంలో చిరంజీవి కూడా నో చెప్పే నటులు కాదు.
రెండు పాటలతో:
కథకు నవరసరాలు జోడిస్తేనే అది పరి పూర్ణం అవుతుందని నమ్మే నటుడాయన. దర్శకుల హీరోగా పనిచేస్తారు. అవసరం మేర చిరు సూచనలు, సలహాలు ఇచ్చినా? దర్శకుడి అదేశాలు కూడా అంతే విధిగా పాటిస్తారు. తాజాగా శుక్రవారం నుంచే కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఇందులో ఓ రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నారు. ఆ రెండు కూడా చిరంజీవి, నయనతారలపై చిత్రీకరించే పాటలు. అందులో ఒకటి గ్రూప్ సాంగ్ కాగా, మరోటి చిరు-నయనతార మధ్య చిత్రీకరించే పాటగా సమాచారం.
అదే మెగాస్టార్ ప్రత్యేకత:
ఆ పాట కోసం ఇరువురు రొమాంటిక్ లిబర్టీ కూడా తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాల నుంచి తెలిసింది. పాటలో రొమాన్స్ కూడా అవసరం కావడంతో మధ్య మధ్యలో రొమాంటిక్ యాంగిల్ ని కూడా టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరు మార్క్ సిగ్నేచర్ స్టెప్స్ కూడా అంతే హైలైట్ కాబోతున్నాయి.చిరుతో సాంగ్ అంటే? ఆ మాత్రం తప్పనిసరి. మెగాస్టార్ నుంచి అభిమానులు ఆశించేదే ఆ రకమైన స్టెప్స్ . ఆ విష యంలో చిరు ఎంత మాత్రం రాజీ పడరు. వయసు 70 ఏళ్లు అయినా? శరీరాన్ని విల్లులా వొంచి డాన్సులు చేయడం ఆయనకు మాత్రమే తెలిసిన టెక్నిక్. సినిమాలో ఉండే ఆరు పాటల్లో ఓ పాటలో కచ్చితంగా చిరు మార్క్ పడేలా చూసుకుంటారు. అదే మెగాస్టార్ ప్రత్యేకత.
