Begin typing your search above and press return to search.

థియేటర్లో ప్రేక్షకుడు అంతసేపు కూర్చుంటారా?

సాధారణంగా ఒక సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుడు మూడు గంటలైనా థియేటర్లో కూర్చోగలుగుతాడు.

By:  Madhu Reddy   |   22 Dec 2025 12:06 AM IST
థియేటర్లో ప్రేక్షకుడు అంతసేపు కూర్చుంటారా?
X

సాధారణంగా ఒక సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుడు మూడు గంటలైనా థియేటర్లో కూర్చోగలుగుతాడు. కానీ కంటెంట్ బాగోలేకపోతే మాత్రం కనీసం గంటసేపు కూర్చోవాలన్నా కూడా కత్తి మీద సాములా ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి ఒక సినిమా ఎక్కువ నిడివితో రన్ టైం లాక్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంత సేపు థియేటర్లో ప్రేక్షకులు కూర్చుంటారా? అనే4 అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా రాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి రన్ టైం లాక్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 2:38 గంటల నిడివిని మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. దీంతో కొంచెం పెద్ద రన్ టైం తోనే ఈ సినిమా రాబోతోందని చెప్పవచ్చు.

ఇకపోతే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏది ఏమైనా రెండున్నర గంటల సినిమా నిడివి అంటే ప్రేక్షకుడు అంతసేపు థియేటర్లో కూర్చుంటాడా? అంత కంటెంట్ తో అనిల్ రావిపూడి ప్రేక్షకులను మెప్పించగలడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ అనుమానాలకు తెరపడాలి అంటే వచ్చే ఏడాది జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాలో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు.. చిరంజీవి - వెంకటేష్ కాంబినేషన్ లో చిత్రీకరించిన పాట కూడా డిసెంబర్ ఆఖరుణ రిలీజ్ చేయనున్నారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

చిరంజీవి తదుపరి విషయాలకు వస్తే.. ఇదివరకే బింబిసారా సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా పూర్తి చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా వచ్చే యేడాది సమ్మర్ కి వాయిదా వేయడం జరిగింది. అలాగే బాబి కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాదికి తీసుకురాబోతున్నారు.. మొత్తానికైతే వచ్చే ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు చిరంజీవి. మరి ఏ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.