ఆకాశంలో ఒక తార.. చిరు, నాని ఏమన్నారంటే..
దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’పై చిరంజీవి, నాని ప్రశంసలు కురిపించారు. దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించిన విధానం, నటీనటుల పెర్ఫార్మెన్స్ను మెచ్చుకున్నారు. ముఖ్యంగా సాత్విక వీరవల్లి తొలి సినిమాతోనే ఆకట్టుకుందని నాని ప్రశంసించగా, పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమని చిరంజీవి సూచించారు.
By: M Prashanth | 25 Nov 2026 1:43 PM ISTదుల్కర్ సల్మాన్ నటించిన ఆకాశంలో ఒక తార సినిమాకు ఇండస్ట్రీ నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా చూసిన చిరంజీవి, నాని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఇద్దరూ కథతో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్ను మెచ్చుకున్నారు. ముఖ్యంగా కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి గురించి నాని చెప్పిన వర్డ్స్ హైలెట్ అవుతున్నాయి.
చిరంజీవి ఈ సినిమా తన మనసును ఎంతగానో కదిలించిందని చెప్పారు. దర్శకుడు పవన్ సాధినేని సున్నితమైన కథను ఎంతో అందంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ముఖ్యంగా సెకండాఫ్ చాలా ఎమోషనల్‌గా ఉందని, సినిమా చూస్తున్నంతసేపూ భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. దుల్కర్ సల్మాన్, సాత్విక తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారని మెచ్చుకున్నారు. శ్రుతి హాసన్, రుహానీ శర్మ నటనకు కూడా మంచి మార్కులు వేశారు.
ఇక జీవీ ప్రకాష్ సంగీతం, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి సాంకేతిక విభాగం సినిమాకు బాగా ఉపయోగపడిందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ రికమెండ్ చేశారు. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని పేర్కొన్నారు. నిర్మాతలు స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా టీమ్స్‌కు అభినందనలు తెలిపారు.
నాని కూడా సినిమాపై తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పారు. దుల్కర్ చేసిన పాత్రను మరెవరూ ఇంత బాగా చేయలేరని ప్రశంసించారు. ముఖ్యంగా సాత్విక డెబ్యూను మెచ్చుకుంటూ కల్పన పాత్రకు ఆమె తప్ప మరెవరూ సరిపోరన్నట్లుగా కామెంట్ చేశారు. అంతేకాదు, సాత్విక చాలా బాగా ఏడిపిస్తావు అంటూ సరదాగా పేర్కొన్నారు. నాని కూడా శ్రుతి హాసన్ నటనను మెచ్చుకున్నారు. రుహానీ శర్మ పోషించిన బిజిలీ పాత్ర చాలా ముద్దుగా ఉందని చెప్పారు.
దర్శకుడు పవన్ సాధినేని కథను తెరకెక్కించిన విధానం, జీవీ ప్రకాష్ సంగీతం తనకు బాగా నచ్చాయని తెలిపారు. నిర్మాతలు సన్నీ గున్నం, రమ్య గున్నంతో పాటు స్వప్న సినిమా, లైట్ బాక్స్ టీమ్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే చిరంజీవి, నాని ఇద్దరూ సినిమాలోని ఎమోషన్స్‌తో పాటు నటీనటుల గురించి మాట్లాడటం విశేషం. ముఖ్యంగా సాత్వికకు ఇది తొలి సినిమానే అయినా ఇద్దరు హీరోల నుంచి ప్రశంసలు దక్కాయి. మరోవైపు దర్శకుడు పవన్ సాధినేనికి కూడా ఈ రెస్పాన్స్ ఉపయోగపడే అవకాశం ఉంది. నవంబర్ 20న విడుదలైన ఆకాశంలో ఒక తార బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇలాంటి సమయంలో చిరంజీవి, నాని లాంటి స్టార్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం మరింత ప్లస్ కావొచ్చు.
