తిలక్ వర్మ కటౌట్ తో మెగాస్టార్ బిగ్ సర్‌ప్రైజ్
దానికి కారణం, మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ యంగ్ క్రికెట్ సెన్సేషన్ తిలక్ వర్మకు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్. ఇది చూశాక, చిరును ఎందుకు 'బాస్' అంటారో మరోసారి క్లియర్‌గా అర్థమైంది.
By: M Prashanth | 16 Oct 2025 4:22 PM ISTషూటింగ్ సెట్ అంటే లైట్స్, కెమెరా, యాక్షన్ అనే హడావుడి ఉంటుంది. కానీ, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెట్‌లో ఆ రోజు సీన్ రివర్స్ అయింది. సినిమా హంగామాను పక్కనపెట్టి, క్రికెట్ ఫీవర్ నడిచింది. దానికి కారణం, మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ యంగ్ క్రికెట్ సెన్సేషన్ తిలక్ వర్మకు ఇచ్చిన స్వీట్ సర్‌ప్రైజ్. ఇది చూశాక, చిరును ఎందుకు 'బాస్' అంటారో మరోసారి క్లియర్‌గా అర్థమైంది. ఇది కేవలం ఒక అభినందన కాదు, ఒక లెజెండ్ చూపించిన క్లాస్.
చిరంజీవి ఎప్పుడూ కూడా టాలెంట్ ఉన్న వారికి తనదైన మద్దతు ఇస్తుంటారు. అవసరమైతే వారు మరో రేంజ్ కు వెళ్లేలా సపోర్ట్ చేస్తారు. ఇక ఆసియా కప్‌లో పాక్‌పై తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్‌కు దేశం మొత్తం ఫిదా అయిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ కూడా తిలక్ ఆటపై ఇదివరకే ప్రశంసలు కురిపించారు. ఇక ఆ కుర్రాడిని తన సెట్‌కు పిలిచి, పర్సనల్‌గా అభినందించాలని ఫిక్స్ అయ్యారు. ఇది కేవలం క్రీడలను గౌరవించడమే కాదు, కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ టాలెంట్‌ను గుర్తించి ఇచ్చే మెగా కిక్.
సెట్‌లోకి తిలక్ ఎంటర్ అవ్వగానే, మొత్తం వైబ్ మారిపోయింది. చిరు అతన్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి, శాలువాతో సత్కరించారు. అసలు సిసలైన మూమెంట్ అప్పుడు వచ్చింది. తిలక్ కెరీర్‌కే హైలైట్‌గా నిలిచే విన్నింగ్ షాట్‌ను ఒక మైండ్‌బ్లోయింగ్ పెయింటింగ్‌గా మార్చి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ తర్వాత కేక్ కటింగ్, నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాతల అప్లాజ్.. ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్.
ఈ సర్‌ప్రైజ్ తిలక్ వర్మకు ఎలాంటి బూస్ట్ ఇస్తుందో మాటల్లో చెప్పలేం. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఏకంగా మెగాస్టార్ నుంచి ఇలాంటి రెస్పెక్ట్ దొరకడం అంటే, అది అతని కాన్ఫిడెన్స్‌ను స్కై లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఇది అతని పర్ఫార్మెన్స్‌పై ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక తిలక్ వర్మను మెగాస్టార్ ఇదివరకే కలిశారు. గతంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో కూడా పక్కనే కూర్చుని అతనితో మ్యాచ్ చూశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఫ్యాన్స్‌కు కావాల్సిన వింటేజ్ చిరును, ఆయన మార్క్ కామెడీ టైమింగ్‌ను, గ్రేస్‌ను ఈ సినిమాలో పక్కాగా చూపిస్తానని అనిల్ రావిపూడి మాటిచ్చాడు. దానికి శాంపిల్‌గా వచ్చిన 'మీసాల పిల్ల' పాట ఇప్పటికే యూట్యూబ్‌లో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసి, సినిమాపై అంచనాలను స్కై లెవెల్‌కి తీసుకెళ్లింది. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.
