Begin typing your search above and press return to search.

'సై రా'తో అవ్వలేదు.. ఈసారి MSG కొట్టేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్. అయితే ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) సినిమాతో ఆయన చూపిస్తున్న జోరు చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవుతోంది.

By:  M Prashanth   |   18 Jan 2026 8:52 AM IST
సై రాతో అవ్వలేదు.. ఈసారి MSG కొట్టేస్తుందా?
X

మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డులకు కేరాఫ్ అడ్రస్. అయితే ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) సినిమాతో ఆయన చూపిస్తున్న జోరు చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవుతోంది. సినిమా రిలీజ్ అయి ఐదు రోజులు గడిచినా బాక్సాఫీస్ వద్ద హవా ఏమాత్రం తగ్గలేదు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కి మెగాస్టార్ వింటేజ్ స్వాగ్ తోడవడంతో థియేటర్ల వద్ద హడావుడి గట్టిగానే కనిపిస్తోంది.

సాధారణంగా పెద్ద సినిమాలకు పండగ సెలవులు ముగిశాక కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో సీన్ రివర్స్ లో ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో ప్రతి ఏరియాలో అదనపు షోలు పడుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఒకే ఒక బిగ్ నంబర్ మీద ఉంది. ఆ నంబర్ ని రీచ్ అయితే తెలుగు సినీ చరిత్రలో మెగాస్టార్ పేరు మీద మరో సరికొత్త రికార్డ్ మొదలవుతుంది.

లేటెస్ట్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 226 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, అసలైన బాక్సాఫీస్ వేట ఇప్పుడే మొదలైందని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. ఈ జోరు చూస్తుంటే త్వరలోనే ఈ చిత్రం 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

గతంలో పాన్ ఇండియా క్రేజ్ తో వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' లాంటి భారీ చిత్రాలు కూడా అందుకోలేకపోయిన ఈ రికార్డ్ ని, ఇప్పుడు ఒక ప్యూర్ తెలుగు కమర్షియల్ మూవీతో చిరంజీవి అందుకోబోతుండటం విశేషం. ఒక రీజినల్ లాంగ్వేజ్ సినిమాగా ఉంటూనే ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇది గనుక జరిగితే టాలీవుడ్ లో ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది.

ముఖ్యంగా ఈ సినిమాకు మరికొన్ని రోజులు కలిసివచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూస్తుంటే రెండు రోజుల్లో వచ్చే వసూళ్లే ఈ సినిమాను 300 కోట్ల మార్కు వైపు పరుగులు తీయిస్తాయని అంచనా వేస్తున్నారు. బుక్ మై షోలో గత 24 గంటల్లోనే లక్షల టికెట్లు అమ్ముడవ్వడం సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనం. సంక్రాంతి విన్నర్ గా ఇప్పటికే MSG నిలిచినప్పటికీ, ఇప్పుడున్న టార్గెట్ మాత్రం చాలా పెద్దది.

మెగా మాస్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ ముగిసేనాటికి 'మన శంకర వరప్రసాద్ గారు' 300 కోట్ల క్లబ్ లో అఫీషియల్ గా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సెలవులు ముగిసేలోపు చిరంజీవి ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.