చిరంజీవి కెరియర్ లో నిలిచిపోయే ఎవర్ గ్రీన్ క్యారెక్టర్లు ఇవే...
50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి... ఒక సామాన్యుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ నిలదోక్కుకోవచ్చు.
By: Gopi Velupala | 3 Oct 2026 4:00 AM IST50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి... ఒక సామాన్యుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ నిలదోక్కుకోవచ్చు. నీ దగ్గర టాలెంట్ ఉంటే ఇండస్ట్రీని శాసించే స్థాయికి సైతం నువ్వు వెళ్లొచ్చు అని చెప్పిన నటుడు చిరంజీవి...బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సుప్రీం హీరోగా మారి ఆ తర్వాత 'మెగాస్టార్' గా అవతరించిన ఘనత కూడా అతనికే దక్కుతుంది... ఆయన లాంటి నటులు ఇండస్ట్రీ చాలా అరుదుగా ఉంటారు. అలాంటి చిరంజీవి తన ఎంటైర్ కెరియర్లో కొన్ని గొప్ప పాత్రలను చేశాడు. 150 పై చిలుకు సినిమాల్లో హీరోగా నటించిన చిరంజీవి తన చేసిన 90% సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయినప్పటికీ అందులో కొన్ని మాత్రం ఎవర్ గ్రీన్ క్యారెక్టర్లు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఆ క్యారెక్టర్లు గుర్తుండిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆ పాత్రలు ఏంటి అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం...
ఖైదీ - సూర్యం
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ' సినిమాలో చిరంజీవి పోషించిన సూర్యం పాత్ర తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని తీసుకువచ్చింది. అలాంటి పాత్ర చేయాలంటే చాలా ఘట్స్ ఉండాలి. తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ సూర్యం రౌడీల మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది సినిమా... సూర్యం క్యారెక్టర్ లో ఒక హై పొటెన్షియాలిటి కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితాన్ని చిరంజీవి పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ఆవిష్కరించాడు. చిరంజీవి ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ లోని లిమిటేషన్స్ ను దాటకుండా పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టర్ కి సరెండర్ అయి నటించాడు.
ఆరాధన - పులిరాజు
భారతి రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సుహాసిని, రాధిక హీరోయిన్ గా తెరకెక్కిన 'ఆరాధన' సినిమాలో చిరంజీవి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ సినిమాలో చిరంజీవి 'పులిరాజు' అనే మాస్ పాత్రలో కనిపించాడు. తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానిని చేసేస్తూ ఉంటాడు. ఎవరిని పడితే వారిని కొట్టడం, అందరితో గొడవలు పెట్టుకోవడం మొత్తానికి ఒక రాక్షసుడిలా ఉంటాడు. అలాంటి వ్యక్తిని సుహాసిని ఎలా మారుస్తుందనిదే ఈ సినిమా స్టోరీ... ఈ పాత్ర కూడా చిరంజీవి కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది...డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కి ఈ పాత్ర అంటే చాలా ఇష్టం. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన ఈ సినిమాలో చిరంజీవి కోపంతో ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ ను ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకొని తన ఆఫీసు లో పెట్టుకున్నాడు.
స్వయంకృషి - సాంబయ్య
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా విజయశాంతి హీరోయిన్ గా తెరకెక్కిన 'స్వయంకృషి' సినిమా చిరంజీవి లోని కొత్త నటుడిని బయటికి తీసింది. అప్పటికే కమర్షియల్ హీరోగా సక్సెస్ లను సాధించిన ఆయన ఒక చెప్పులు కుట్టేవాడి క్యారెక్టర్ లో చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు. ఆ క్యారెక్టర్ లో ఎక్కడా కూడా కమర్షియల్ ఇమేజ్ ఉన్న చిరంజీవి మనకు కనిపించడు. కేవలం చెప్పులు కొట్టుకునే ఒక సాంబయ్య మాత్రమే ఆ క్యారెక్టర్ లో కనిపిస్తాడు... అప్పుడు చిరంజీవికి ఉన్న ఇమేజ్ ను బట్టి చూస్తే ఆ క్యారెక్టర్ ని ఆయన ఒప్పుకోవడమే ఒక పెద్ద సాహసమని చెప్పాలి...
రుద్రవీణ - సూర్యనారాయణ మూర్తి
కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'రుద్రవీణ' సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా కనిపించిన చిరంజీవి కుల వ్యవస్థ మీద వ్యతిరేకమైన పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఎందుకని సమాజంలో కులం గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటూ ఆయన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒక జాతిని మేల్కొల్పే పాత్రలో ఆయన నటించడం నిజంగా గొప్ప విషయం... ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయిన కూడా సినిమాకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది... సమాజంలో లోతుగా పేరుకుపోయిన కుల వ్యవస్థను చిరంజీవి ఈ సినిమాతో ప్రశ్నించాడనే చెప్పాలి...
చంటబ్బాయి - జేమ్స్ పాండ్
జంధ్యాల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీలో చిరంజీవి చార్లీ చాప్లిన్ ను అనుసరిస్తూ చేసిన కామెడీ ప్రేక్షకులందరికి నవ్వులు పంచింది. అలాగే తను చేసే ఇన్వెస్టిగేషన్ కూడా కామెడీగా ఉండటం చూస్తుంటే కామెడీ చేయడం లో చిరంజీవిని కొట్టేవారెవరు లేరనిపిస్తుంది...
జగదేకవీరుడు అతిలోక సుందరి - రాజు
రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి రాజు అనే పాత్రలో కనిపించాడు. మొత్తానికైతే రాజు పాత్ర తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ గా నిలిచిపోతుంది. ఆ క్యారెక్టర్ లో చిరంజీవి అద్భుతమైన ఫైట్లు చేస్తూనే కమర్షియాల్టిని ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకుంటూనే నటన విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు...
గ్యాంగ్ లీడర్ - రాజారాం
విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమా కమర్షియల్ సినిమాలన్నింటికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పటినుంచి ఇప్పటివరకు ది బెస్ట్ కమర్షియల్ సినిమాల లిస్ట్ కనక తీసినట్లైతే అందులో గ్యాంగ్ లీడర్ సినిమా ప్రథమ స్థానంలో ఉంటుంది. అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవి రాజారాం పాత్రలో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆదరించాడు. అలాగే తన అన్నప్రాణాలను తీసిన రౌడీల మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ... మొత్తానికైతే ఈ సినిమా అప్పట్లో చిరంజీవి స్టామినా ఏంటో చూపించింది... ఇక ఈ సినిమాలో చిరంజీవి వాడిన 'చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ఫాడించేస్తాను' అనే డైలాగు ఇప్పటికీ చాలా ఫేమస్...
ఆపద్భాందవుడు - మాధవ
కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న కాలంలో చిరంజీవి కావాలనే ఏరి కోరి కె విశ్వనాథ్ తో 'ఆపద్బాంధవుడు' సినిమా చేశాడు. అందులో 'మాధవ' క్యారెక్టర్ లో చిరంజీవి ది బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇచ్చాడు. ఆర్ట్ సినిమాలను చిరంజీవి చేయలేడు అంటూ అప్పట్లో వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ చిరంజీవి ఆర్ట్ సినిమాల్లో ప్రాణం పెట్టి నటించి చూపించాడు. సముద్రం దగ్గర శివలింగాన్ని చేసి చిరంజీవి తన ఆవేదనను దేవుడితో చెప్పుకుంటూ నువ్వు లేవు అని ఆ శివలింగాన్ని సముద్రంలోకి విసిరేసే సీన్ లో ఆయన చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆ సీన్ లో చిరంజీవి నటనను మ్యాచ్ చేసే కెపాసిటి ఇండియాలో ఏ నటుడికి లేదనిపిస్తుంది.
ఇంద్ర - ఇంద్రసేనారెడ్డి
బి.గోపాల్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఇంద్ర సినిమా చిరంజీవికి కమర్షియల్ సక్సెస్ ని సాధించి పెట్టింది. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాల్లో 'ఇంద్ర' సినిమా కూడా ఒకటి కావడం విశేషం... చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో ఈ పాత్ర ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది...
ఠాగూర్ - ఠాగూర్
వి.వి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఠాగూర్ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేసింది... అవినీతిని అంతం చేసే క్యారెక్టర్ లో చిరంజీవి ఒదిగిపోయి నటించాడు. ప్రొఫెసర్ గా కనిపిస్తూనే జనాలను హింసించి అన్యాయంగా డబ్బులు గుంజే ప్రతి ఒక్కరి పాలిట యమకింకరుడు అయ్యాడు...
శంకర్ దాదా ఎంబీబీఎస్ - శంకర్
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'మున్నాభాయ్ ఎంబిబిఎస్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి ఇందులో రౌడీగా కనిపిస్తూనే 40 సంవత్సరాల వయసులో ఎంబిబిఎస్ చదువే స్టూడెంట్ గా కాలేజీ లో ఆయన పంచిన ఫన్ వేరే లెవెల్లో ఉంటుంది. కామెడీతో పాటు అందరినీ ఆలోచింపజేసేలా ఒక మెసేజ్ ను కూడా ఇచ్చాడు. 'రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం' అంటూ ఆయనిచ్చిన మెసేజ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. చిరంజీవి శంకర్ క్యారెక్టర్ లో అటు కామెడీని పండిస్తూనే ఎమోషన్స్ ను సైతం ఫుల్ ఫిల్ చేస్తూ ఆ క్యారెక్టర్ కి డెప్త్ ను తీసుకువచ్చాడు...
సైరా - ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సైరా' ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సైతం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. మొదటి స్వాతంత్య సమరయోధుడి పాత్రలో చిరంజీవి కనిపించి తన అభిమానులకు ఒక మంచి కిక్ ఇవ్వడమే కాకుండా అప్పటిదాకా చేస్తున్న కమర్షియల్ సినిమాలకు చెక్ పెడుతూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం... ఈ పాత్రలో చిరంజీవి పర్ఫెక్ట్ స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించాడు. ఇలాంటి పాత్ర చేయడం తనకు మొదటిసారి అయిన కూడా ఆయన చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ను ఇచ్చాడు.
ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాల్లో ఈ క్యారెక్టర్లన్ని ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని డిఫరెంట్ పాత్రలను పోషిస్తే అవి కూడా చిరంజీవి ఇమేజ్ ను మరింత పెంచే అవకాశాలైతే ఉన్నాయి...
