Begin typing your search above and press return to search.

మళ్లీ పండక్కే చిరు బాబీ.. పక్కా ప్లాన్ తోనే..

2023 సంక్రాంతి బరిలో నిలిచిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   18 Aug 2026 3:04 PM IST
మళ్లీ పండక్కే చిరు బాబీ.. పక్కా ప్లాన్ తోనే..
X

చిరంజీవి బాబీ కాంబినేషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి బరిలో నిలిచిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా రెండోసారి ఈ హిట్ కాంబో మెగా 158 ప్రాజెక్ట్ తో రిపీట్ అవుతోంది. ఈ సినిమాను కూడా పక్కాగా సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో హడావిడి పడకుండా ఈసారి షూటింగ్ ను చాలా ప్లాన్డ్ గా స్పీడప్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు నలభై రోజుల షూటింగ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్ అవుట్ పుట్ ను కూడా దాదాపుగా లాక్ చేసేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒక పక్క షూట్ చేస్తూనే ఇంకో పక్క ఫైనల్ కట్ రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం టీమ్ మొత్తం సెకండాఫ్ మీద పూర్తి ఫోకస్ పెట్టింది. సినిమా మేకింగ్ కోసం నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని పక్కా వింటేజ్ మాస్ లుక్ లో చూపించి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు బాబీ. కానీ ఈసారి ఆ ఫార్ములాను పక్కనపెట్టి యాక్షన్ డోస్ గట్టిగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గానే ఇంటర్వెల్ కు సంబంధించిన ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. అందులో రా అండ్ బ్లడీ యాక్షన్‌తో ఈ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. అంటే ఒక కొత్త టోన్ తో బాబీ ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాడు.

సంక్రాంతి రిలీజ్ అంటే షూటింగ్ పూర్తయితే సరిపోదు. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్స్ కు కూడా చాలా టైమ్ కావాలి. అందుకే ఫస్ట్ హాఫ్ ను ఇప్పుడే లాక్ చేసుకుని టీమ్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇక ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ మీద పెద్దగా డీటెయిల్స్ బయటకు రాలేదు కాబట్టి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ చేస్తారనే ఆసక్తి జనాల్లో నెలకొంది.

ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో ఫెస్టివల్ సీజన్ ను క్యాష్ చేసుకున్న ఈ కాంబో ఇప్పుడు మళ్లీ అదే సీజన్ ను టార్గెట్ చేసింది. అయితే ఈసారి వాళ్ల ముందున్న సవాల్ పెద్దదే. కొత్త కథతో ఇంకో మెట్టు పైకి ఎక్కి అంచనాలను అందుకోవాల్సిన బరువు ఉంది. మెగా ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికైతే టీమ్ అనుకున్న ప్లాన్ ప్రకారమే షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతోంది. మరి పుట్టినరోజు నాడు వచ్చే అప్డేట్ ఈ సంక్రాంతి టార్గెట్ మీద ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి.