మెగా158 కోసం మాళవికనే కాదు, మరో మలయాళ నటుడు కూడానా?
సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుండగా, నవంబర్ ఆఖరికి షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారట డైరెక్టర్ అనిల్.
By: Sravani Lakshmi Srungarapu | 18 Oct 2025 10:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కెరీర్ విషయంలో ఫుల్ స్పీడు మీదున్నారు. ఆల్రెడీ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ ను పూర్తి చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్న చిరూ, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ తో సినిమా అంటే షూటింగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగా దూసుకెళ్తుందని అందరికీ తెలుసు.
ప్రీ ప్రొడక్షన్ లో మెగా158
సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుండగా, నవంబర్ ఆఖరికి షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారట డైరెక్టర్ అనిల్. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్, బాబీ కొల్లి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో రానున్న 158వ సినిమాకు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
మెగా158లో మాళవికా మోహనన్
నవంబర్ లో మెగా158 పూజా కార్యక్రమాలతో మొదలై, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుందని సమాచారం. ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం ఈ సినిమాలో మాళవిక మోహనన్ నటించనుందని తెలుస్తోంది. ఆల్రెడీ మాళవిక తెలుగులో రాజా సాబ్ చేస్తుండగా, ఆ సినిమా రిలీజ్ కాకుండానే అమ్మడికి మరో మెగా ఆఫర్ దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి.
పవర్‌ఫుల్ రోల్ లో మోహన్ లాల్
కాగా మెగా158పై అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి కారణం గతంలో చిరూ- బాబీ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఇప్పుడు మరోసారి వీరద్దరూ కలిసి సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై మంచి హైప్ నెలకొంది. కాగా ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. మెగా158లో ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో మోహన్ లాల్ ను భాగం చేస్తే మెగా158 క్రేజ్ మరింత పెరుగుతుందని బాబీ భావిస్తున్నారట. ఈ వార్త నిజమైతే మాత్రం మూవీ లవర్స్ కు చిరూ, మోహన్ లాల్ ను ఒకే స్క్రీన్ పై చూడటం గొప్ప అనుభూతినివ్వడం ఖాయం.
ఇదిలా ఉంటే ఆల్రెడీ ఈ సినిమా కోసం మలయాళ నటి మాళవికను తీసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మరో మలయాళ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవడం చూస్తుంటే బాబీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా మోహన్ లాల్, మాళవిక కలిసి రీసెంట్ గానే హృదయపూర్వం అనే సినిమాలో కలిసి నటించగా, ఆ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
