Begin typing your search above and press return to search.

మెగా, బాబీ మూవీ.. అసలు ప్లాన్ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ మెగా 158పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   3 April 2026 3:57 PM IST
మెగా, బాబీ మూవీ.. అసలు ప్లాన్ ఏంటి?
X

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ మెగా 158పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఆ సినిమా ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు పూర్తి చేసిందని సమాచారం.

ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిందని తెలుస్తోంది. తొలి షెడ్యూల్‌ ను హైదరాబాద్‌ లో ప్లాన్ చేశారట. ఈసారి చిరంజీవిని మరింత పవర్‌ ఫుల్, ఎమోషనల్ పాత్రలో చూపించేందుకు దర్శకుడు బాబీ ప్రత్యేకంగా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ఆ ప్రాజెక్ట్‌ పై అంచనాలు మరింత పెరిగాయి.

ఆ సినిమాలో మాస్ యాక్షన్‌ తో పాటు ఎమోషన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే తరహాలో మెగా 158ను కూడా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో చిరంజీవి సరసన ప్రియమణి హీరోయిన్‌ గా నటించనున్నారు. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ కథను రూపొందించినట్లు సమాచారం.

చిరంజీవి కుమార్తె పాత్రలో మలయాళ నటి ప్రీతి ముకుందన్‌ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తుండగా.. మాలీవుడ్ స్టార్ మోహన్‌ లాల్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఆయన పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ గా కనిపించనున్నారని టాక్. ఇక బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే మెగా 158 మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. సంగీతం విషయానికి వస్తే, తమన్ ఆ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారని మొదట సమాచారం వచ్చినా, తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

బంగాల్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను యాడ్ చేస్తూ బాబీ ఈ కథను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఫస్ట్ లుక్ ఇంకా విడుదల కాకపోయినా, ఇప్పటికే సినిమా పై సోషల్ మీడియాలో భారీ హైప్ నెలకొంది. 2027 సంక్రాంతి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏదేమైనా చిరంజీవి- బాబీ కాంబినేషన్ లో మరో మూవీ లాంచింగ్ కు టైమ్ దగ్గరపడింది.